త్రీడి ప్రింటింగ్ హోం నమునా
అమెరికా : అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా మందికి సొంత గృహాలు ఉండవు. అలాంటి వారికోసం అతి తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా కేవలం 24 గంటల్లోనే అందమైన ఇంటిని నిర్మించడానికి టెక్సాస్ రాజధాని ఆస్టిన్ నగరంలో గల ఐకాన్ అనే సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. న్యూస్టోరీ అనే మరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని మధ్యతరగతి వారి సొంతింటి కలను నిజం చేయనుంది. ఈ ఇళ్లను అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం త్రీడి ప్రింటింగ్‌తో నిర్మించనున్నారు.
ఐకాన్-న్యూస్టోరీ భాగస్వామ్యంలో ఒక సర్వే నిర్వహించింది. అందులో 1.2 బిలియన్ మంది జనాభాకు గృహ సదుపాయం లేదన్న విషయం తేలింది. దాంతో తక్కువ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని ఐకాన్ సంస్థ నిర్ణయించుకుంది. టెక్సాస్ నగరంలో జరుగుతున్న ఎస్‌ఎక్స్ ఎస్‌డబ్య్లూ ఫెస్టివల్‌లో వీరు నిర్మించిన ఇంటి నమునాను ప్రదర్శించారు. కేవలం రూ.2.6 లక్షలతోనే ఈ 3డీ ప్రింటెడ్ ఇళ్లు నిర్మిస్తామని, వాటికి సంబంధించి అన్ని ప్రమాణాలను పాటిస్తున్నట్టు ఐకాన్ సంస్థ తెలిపింది.
తక్కువ నీరు, పవర్‌ను వాడి ఇళ్లు నిర్మిస్తామని సంస్థ తెలిపింది. ఇతర కాలనీ వాసులతో కూడా సంప్రదించి ఇందులో ఉండాల్సిన సౌకర్యాల గురించి సలహాలు స్వీకరిస్తున్నట్టు, భద్రత, పటిష్టత, పునర్ధురణ వంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కూడా సంస్థ పేర్కొంది. అయితే 2014లో కూడా ఇలాంటి త్రీడి టెక్నాలజీతో 24 గంటల్లోనే నిర్మించిన విషయం తెలిసిందే. కాకపోతే దాని నిర్మాణ వ్యయం ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment