
దేశీయ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సంచలనం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్విగ్గీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ తోపాటు వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సర్వీసుల్ని ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సదుపాయం పొందాలనుకునే డెలివరీ బాయ్స్ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయడం లేదా ఎస్‌ఓఎస్ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా అంబులెన్స్ సేవల్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
చదవండి👉 కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..స్విగ్గీకి భారీ షాక్ ఇచ్చిన 900 రెస్టారెంట్లు
స్విగ్గీ డెలివరీ బాయ్, లేదంటే వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేవలం 12 నిమిషాల్లో అంబులెన్స్ సౌకర్యం లభిస్తుందని స్విగ్గీ తెలిపింది. ఈ సౌకర్యం పొందేందుకు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, కేవలం పార్టనర్ ఐడీని చెబితే సరిపోతుందని సంస్థ వెల్లడించింది. అంతేకాదు స్విగ్గీ అందిస్తున్న ఇన్సూరెన్స్ కవరేజీతో మా యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ, వారి జీవిత భాగస్వాములు, ఇద్దరు పిల్లలుకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. ఖర్చులో సబ్సిడీ కల్పిస్తాం’ అని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది.
పైలెట్ ప్రాజెక్ట్ కింద అంబులెన్స్ సౌకర్యాన్ని దేశ వ్యాప్తంగా బెంగళూరు, ఢిల్లీ,ఎన్‌సీఆర్,హైదరాబాద్, ముంబై,పూణే, కోల్‌కత ప్రాంతాల్లో యాక్టీవ్ డెలివరీ బాయ్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే వెసలు బాటు కల్పించింది. ఇందుకోసం అంబులెన్స్ సర్వీసులు అందించే సంస్థలతో స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకుంది.
చదవండి👉‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్
Comments
Please login to add a commentAdd a comment