న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ రిటైల్ పంపిణీ సంస్థ లింక్స్ లాజిస్టిక్స్ లిమిటెడ్(లింక్)ను కొనుగోలు చేయనున్నట్లు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ వెల్లడించింది. షేర్ల మారి్పడి ద్వారా రామ్‌కో సిమెంట్స్, రామ్‌కో ఇండస్ట్రీస్ నుంచి లింక్‌ను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. వెరసి టెక్నాలజీ ఆధారిత పంపిణీ ప్లాట్‌ఫామ్ ద్వారా దేశీ ఫుడ్, గ్రోసరీ రిటైల్ మార్కెట్లో ప్రవేశించనున్నట్లు వివరించింది.
మరోవైపు లింక్స్ లాజిస్టిక్స్‌లో తమకున్న 49.95 శాతం వాటాను బండెల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్(స్విగ్గీ మాతృ సంస్థ)కు విక్రయించనున్నట్లు రామ్‌కో సిమెంట్స్ స్టాక్ ఎక్సే్చంజీలకు వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా బండెల్ టెక్‌కు చెందిన కచ్చితంగా మారి్పడి చేసుకోవలసిన 24,18,915 ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను పొందనున్నట్లు పేర్కొంది.
ఇదేవిధంగా రామ్‌కో ఇండస్ట్రీస్ సైతం లింక్స్‌లోగల 46.15 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేసేందుకు బండెల్ టెక్‌తో షేర్ల సబ్‌్రస్కిప్షన్, కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్‌ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. దీనికి బదులుగా బండెల్‌కు చెందిన 22,35,223 సీసీపీఎస్‌లను పొందనున్నట్లు వెల్లడించింది. కాగా.. తాజా కొనుగోలు తదుపరి లింక్ సహవ్యవస్థాపకుడు, సీఈవో శేఖర్ భెండే అధ్యక్షతన స్వతంత్ర బిజినెస్ యూనిట్‌గానే కార్యకలాపాలు నిర్వహిస్తుందని స్విగ్గీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment