సాక్షి, న్యూఢిల్లీ: జీ-20 శిఖరాగ్ర సమావేశానికి దేశ రాజధాని ముస్తాబవుతోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9,10 తేదీల్లో జీ20 సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరుకానున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న తరుణంలోకేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
ఆంక్షల విధింపు
సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారని కేంద్రం వెల్లడించింది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా జీ 20 సదస్సు నేపథ్యంలో మూడు రోజుల పాటు రాజధాని నగరంలో పలు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా నగరంలో క్లౌడ్ కిచెన్, డెలివరీ సేవలకు అనుమతిని నిరాకరించారు.
జొమాటో, స్విగ్గీ, అమెజాన్ అన్నీ బంద్
సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలను నిషేధించారు. వీటితోపాటు బ్లింకిట్, జెప్టో.. ఈ కామర్స్ సంస్థలు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థల డెలివరీలను కూడా అనుమతించబోరు. ఎన్‌డీఎమ్‌సీ ప్రాంతంలో డెలివరీ సేవలను అనుమతించేది లేదని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) ఎస్‌ఎస్ యాదవ్ తెలిపారు. ఈ ఆంక్షలు ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అదేవిధంగా ఈనెల 7వ తేది అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.
చదవండి: ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే..
వాటికి మినహాయింపు
అయితే వీటికి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, మెడిసిన్ వంటి వస్తువులు డెలివరీ ఉంటుందని ఆయన తెలిపారు వైద్య సేవలు, పోస్టల్ సేవలు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సెప్టెంబర్ 8, 9,10 తేదీల్లో ఢిల్లీలో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. 9, 10వ తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. సమ్మిట్ కారణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని దుకాణాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
వర్క్ ఫ్రం హోమ్
సెప్టెంబర్ 8 శుక్రవారం ఓజు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 వరకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండనున్నాయని.. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో థియేటర్లు, రెస్టారెంట్లు కూడా మూసివేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment