న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే? | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే?

Published Tue, Jan 2 2024 9:12 PM

All Time Record High Zomato Swiggy Food Delivery - Sakshi

2024 కొత్త సంవత్సరంలో జొమాటో, స్విగ్గీ, ఓయో వంటి సంస్థలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 31న ఒకే రోజు అత్యధిక ఆర్డర్స్ చేసినట్లు జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించాడు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జొమాటో - 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్​లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జొమాటో డెలివరీ బాయ్స్ ఆ ఒక్క రోజులో పొందిన మొత్తం టిప్స్ ఏకంగా రూ. 97 లక్షలు కావడం గమనార్హం. 

స్విగ్గీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.80 లక్షల కిలోల బంగాళాదుంపలను ఆర్డర్ చేశారు. 200 ప్యాకెట్ల సింగిల్ కెచప్‌ను సూరత్‌లో డెలివరీ చేశారు. సుమారు 1.04 లక్షల మంది ప్రజలు ఫుడ్ డెలివరీ చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. గతంలో పోలిస్తే ఈ సేల్స్ చాలా ఎక్కువని చెబుతున్నారు.

బిర్యానీ - న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్​లోనే మొత్తం 4.8 లక్షల బిర్యానీలు డెలివరీ అయ్యాయని చెబుతున్నారు. అంటే ప్రతి నిమిషానికి 1244 ఆర్డర్స్ బిర్యానీ కోసం వచ్చినట్లు సమాచారం. 

ఓయో రూమ్ బుకింగ్స్​ - న్యూ ఇయర్ సందర్భంగా ఫుడ్ మాత్రమే కాకుండా ఓయో రూమ్స్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయికి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి 37 శాతం లేదా 6.2 లక్షల బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 30, 31 వ తేదీల్లో మాత్రమే 2.3 లక్షల రూమ్స్ బుక్ అయ్యాయని, ఇందులో కూడా ఎక్కువగా అయోధ్యలో ఎక్కువగా 70 శాతం, తరువాత స్థానాల్లో గోవాలో 50 శాతం అని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement