హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను జనం బిర్యానీ, పిజ్జాలతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ, 2.5 లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను కస్టమర్లకు చేరవేసినట్లు చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ వెల్లడించింది. ట్విట్టర్‌లో తాము నిర్వహించిన ఓ సర్వేలో 75.4 శాతం మంది హైదరాబాద్ బిర్యానీ, 14.2 శాతం మంది లక్నో బిర్యానీ, 10.4 శాతం మంది కోల్‌కతా బిర్యానీని ఇష్టపడుతున్నట్లు తేలిందని వివరించింది.
హైదరాబాద్‌లో బావార్చీ హోటల్ పసందైన బిర్యానీకి పేరొందిన హోటల్. కొత్త సంవత్సరం డిమాండ్‌ను తట్టుకోవడానికి శనివారం ఏకంగా 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు బావార్చీ హోటల్ యాజమాన్యం తెలియజేసింది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి 7 గంటల కల్లా 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను కస్టమర్లు ఆర్డర్ చేశారని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ పేర్కొంది. అలాగే 2,757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లను కస్టమర్లకు చేరవేశామని తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 12,344 మంది వినియోగదారులు కిచిడీ కోసం స్విగ్గీలో ఆర్డర్ చేయడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment