Biryani packets
-
Zubeda Ali: నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్స్ పంచిన కమెడియన్ అలీ భార్య జుబేదా (ఫోటోలు)
-
నయా సాల్ జోష్.. 3.50 లక్షల బిర్యానీలు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను జనం బిర్యానీ, పిజ్జాలతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ, 2.5 లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను కస్టమర్లకు చేరవేసినట్లు చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ వెల్లడించింది. ట్విట్టర్లో తాము నిర్వహించిన ఓ సర్వేలో 75.4 శాతం మంది హైదరాబాద్ బిర్యానీ, 14.2 శాతం మంది లక్నో బిర్యానీ, 10.4 శాతం మంది కోల్‌కతా బిర్యానీని ఇష్టపడుతున్నట్లు తేలిందని వివరించింది. హైదరాబాద్‌లో బావార్చీ హోటల్ పసందైన బిర్యానీకి పేరొందిన హోటల్. కొత్త సంవత్సరం డిమాండ్‌ను తట్టుకోవడానికి శనివారం ఏకంగా 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు బావార్చీ హోటల్ యాజమాన్యం తెలియజేసింది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి 7 గంటల కల్లా 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను కస్టమర్లు ఆర్డర్ చేశారని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ పేర్కొంది. అలాగే 2,757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లను కస్టమర్లకు చేరవేశామని తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 12,344 మంది వినియోగదారులు కిచిడీ కోసం స్విగ్గీలో ఆర్డర్ చేయడం మరో విశేషం. -
బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు
నంద్యాల: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఓ అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్ పోటీ చేస్తున్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు. మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు. చదవండి: బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్ చేయించి.. -
పొట్ట కొట్టారు..ట్రాన్స్‌జెండర్ మహిళ కంటతడి
కొచ్చి : సమాజంలో తమపట్ల ఉన్న చెడు అభిప్రాయాన్ని తుడిచేయాలకుంది ఆ ట్రాన్స్‌జెండర్ మహిళ. అందరిలా గౌరవంగా బతకాలనుకున్నారు. సొంతకాళ్లపై నిలబడాలనుకున్నారు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని బిర్యానీ సెంటర్ పెట్టుకున్నారు. ఇతర షాపుల కంటే తక్కువ ధరకు క్వాలిటీ బిర్యానీని అందజేశారు. దీంతో ఆమె గిరాకీ రోజు రోజుకి పెరిగిపోయింది. అయితే ఇది గిట్టని చుట్టుపక్కల వ్యాపారస్తులు ఆమె మీద లేని పోని రూమర్లు సృష్టించారు. ఆమెకు వస్తున్న గిరాకి దెబ్బదీశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కొచ్చికి చెందిన ట్రాన్స్‌జెండర్ ఉమన్ సజన షాజీ బిర్యానీ సెంటర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న మరో నలుగురు ట్రాన్స్‌జెండర్ మహిళలకు కూడా ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. ఇతరుల కంటే తక్కువ ధరకు క్వాలిటీపుడ్ అందిస్తున్నారు. ఇది గిట్టని పక్క షాపు వాళ్లు ఆమెపై రూమర్లు సృష్టించారు. ఆమె సరఫరా చేసే బిర్యానీ క్వాలిటీది కాదని పుకారు రేపారు. దీంతో ఆమె గిరాకీ దెబ్బతింది. తనతో పాటు మరో నలుగురి ట్రాన్స్‌జెండర్ మహిళలకు ఉపాధి దొరుకుతుందని బిర్యానీ సెంటర్ పెడితే.. కావాలనే కొంతమంది తన గిరాకీ దెబ్బతీస్తున్నారని షాజీ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను చెప్పుకుంటా భోరున విలపించారు. తన షాపుకు ఎదురుగా ఉన్న చెపల వ్యాపారీ గిరీష్ వల్లే తన గిరాకీ దెబ్బతిందని ఆరోపించారు. తమ బిర్యానీ సెంటర్‌కు వచ్చే కస్టమర్లకు అబద్దాలు చెప్పి గిరాకీ పాడు చేస్తున్నారని తన గోడును విన్నవించారు. మొదట్లో తమ షాపులో 300 బిర్యానీ ప్యాకెట్ల వరకు అమ్ముడుపోయేవని, కొద్దిరోజుల తర్వాత అవి 150కి పడిపోయాయని, ఇప్పుడైతే 20 ప్యాకెట్లు కూడా సేల్స్ కావడంలేదని ఆవేదన వ్యక్త చేశారు.‘రైళ్లలో యాచించడం, రాత్రిపూట వీధుల్లో తిరిగే బదులు పని చేసుకొని మంచి జీవితాన్ని గడపమని ప్రజలు చెబుతుంటారు. సమాజం మర్యాదగా పనిచేయడానికి అనుమతించకపోతే, మేము ఏం చేయాలని’అని షాజీ భోరున విలపించారు. -
ఓటర్లకు 'బిర్యానీ' పంచుతున్న తెలుగు తమ్ముళ్లు
తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని టీడీపీ కార్యకర్తలు ఓటర్లను శతవిధాల ప్రలోభ పెడుతున్నారు. అందులోభాగంగా విశాఖపట్నంలోని మల్కాపురం ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు టీడీపీ కార్యకర్తలు బిర్యానీ ప్యాకెట్లు పంచిపెడుతూ... తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలంటూ డమ్మీ ఈవీఎంతో ప్రచారం చేస్తున్నారు. అయితే వారిని కట్టడి చేసేందుకు అటు పోలీసులు కానీ ఇటు ఎన్నిక సిబ్బంది గానీ ప్రయత్నించకపోవడం గమనార్హం.