pizza delivery
-
ఈ పిజ్జా చాలా ఫేమస్.. దీని చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
ఇటలీకి చెందిన పిజ్జా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఖండఖండాంతరాల్లో చాలామంది అభిమానించే పిజ్జా వంటకం పద్దెనిమిదో శతాబ్దిలో ఇటలీలోని నేపుల్స్ ప్రాంతంలో పుట్టిందని చెబుతారు. పిజ్జా గురించి ఇప్పటి వరకు తెలిసిన చరిత్ర ఇదే! అయితే, పిజ్జా అంతకంటే పురాతనమైనదేననేందుకు తాజా ఆధారం లభించింది. నేపుల్స్కు చేరువలోని పోంపే నగరంలో రోమన్ కాలానికి చెందిన పురాతన శిథిల భవనంలో గోడలపై ఉన్న కుడ్యచిత్రాల్లో పిజ్జా చిత్రం కూడా ఉంది. ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. సహజమైన రంగులతో చిత్రించిన ఈ కుడ్యచిత్రంలో వెండిపళ్లెంలో పిజ్జాను తలపించే రొట్టె, పండ్లు, మధుపాత్ర ఉన్నాయి. ఈ చిత్రంలోని రొట్టె పిజ్జాకు తొలిరూపం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోమన్ నాగరికత కాలానికి చెందిన ఈ భవంతి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందినదని వారు చెబుతున్నారు. ఇక్కడకు చేరువలోని మౌంట్ వెసూవియస్ అనే అగ్నిపర్వతం క్రీస్తుశకం 79లో బద్దలైనప్పుడు పాంపే, ఆప్లాంటిస్ నగరాలు లావాలోను, బూడిదలోను కూరుకుపోయాయి. ఇటీవల అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన భవంతి, అందులోని పిజ్జా కుడ్యచిత్రం బయటపడటం విశేషం. చదవండి America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
నయా సాల్ జోష్.. 3.50 లక్షల బిర్యానీలు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను జనం బిర్యానీ, పిజ్జాలతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ, 2.5 లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను కస్టమర్లకు చేరవేసినట్లు చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ వెల్లడించింది. ట్విట్టర్లో తాము నిర్వహించిన ఓ సర్వేలో 75.4 శాతం మంది హైదరాబాద్ బిర్యానీ, 14.2 శాతం మంది లక్నో బిర్యానీ, 10.4 శాతం మంది కోల్‌కతా బిర్యానీని ఇష్టపడుతున్నట్లు తేలిందని వివరించింది. హైదరాబాద్‌లో బావార్చీ హోటల్ పసందైన బిర్యానీకి పేరొందిన హోటల్. కొత్త సంవత్సరం డిమాండ్‌ను తట్టుకోవడానికి శనివారం ఏకంగా 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు బావార్చీ హోటల్ యాజమాన్యం తెలియజేసింది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి 7 గంటల కల్లా 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను కస్టమర్లు ఆర్డర్ చేశారని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ పేర్కొంది. అలాగే 2,757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లను కస్టమర్లకు చేరవేశామని తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 12,344 మంది వినియోగదారులు కిచిడీ కోసం స్విగ్గీలో ఆర్డర్ చేయడం మరో విశేషం. -
మంటల్లో కాలిపోతున్న ఇల్లు.. హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్
వాషింగ్టన్: అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యువకుడు చేసిన సాహసాన్ని పోలీసులు సహా స్థానికులు కొనియాడారు. పిజ్జా డెలివరీ బాయ్ హీరో అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అమెరికా లఫయెట్టెలో ఈ ఘటన గతవారం జరిగింది. హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువకుడి పేరు నికోలస్ బోస్టిక్. వయసు 25 ఏళ్లు. పిజ్జాలు డెలివరీ చేసి అర్ధరాత్రి ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు ఓ ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. వెంటనే పెద్దగా అరుస్తూ ఆ ఇంటి బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్లాడు. ఇతని అరుపులు విని ఇంట్లో మొదటి అంతస్తులో నిద్రపోతున్న నలుగురు పిల్లలు లేచారు. బోస్టిక్ వాళ్ల దగ్గరకు వెళ్లి కిందకు తీసుకొస్తుండగా.. మరో ఆరేళ్ల చిన్నారి లోపలే ఉన్నట్లు వాళ్లు చెప్పారు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బోస్టిక్ మంటల్లోనే గదిలోపలికి వెళ్లాడు. అయితే ఆ పిల్లాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఏడుస్తూ కన్పించాడు. దీంతో కిటికీ అద్దాలను చేతితోనే పగలగొట్టి కిందకు దూకాడు బోస్టిక్. ఆరేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ప్రాణాలతో బయటపడ్డవారిలో 18 ఏళ్లు, 13 ఏళ్లు, ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉన్నారు. బోస్టిక్ సహసాన్ని పోలీసులు కొనియాడారు. అతను నిస్వార్థంగా ఆలోచించి ఐదుగురి ప్రాణాలను కాపాడాడని ప్రశంసించారు. అతను రియల్ హీరో అని పొగడ్తలతో ముంచెత్తారు. పోలీసు శాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్లో షేర్ చేశారు. Here’s the video to go along with the story. pic.twitter.com/TvZ5wzCg1f — LafayetteINPolice (@LafayetteINPD) July 15, 2022 చదవండి: రన్ వేపై దిగుతూ మరో విమానాన్ని ఢీకొట్టిన ఫ్లైట్.. నలుగురు మృతి -
ఆ పేలుడు ఘటనలో క్లూ... ఆర్డర్ చేసిన పిజ్జా డెలివరీ
Pizza order gave Firs Clue: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం పై రాకెట్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పిజ్జా ఆర్డరే వాళ్లకు అసలైన క్లూ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ కార్యాలయం పై దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఇంటెలిజెన్స్ అధికారి పిజ్జా డెలివరీ కోసం బయటకు వెళ్లినట్టు తెలిసింది. అతను గేటు నుంచి బయటకు రాగనే కార్యాలయానికి సమీపంలో ఆగి ఉన్న తెల్లటి మారుతి స్విఫ్ట్ కారును ఆ అధికారి గమనించాడు. అతను పిజ్జాతో లోపలికి వెళ్లిన మరు క్షణంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఈ కారుపై దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు ఆ ప్రాంతంలోని సీసీఫుటేజ్‌లను, సుమారు 7 వేల మొబైల్ డంప్‌లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటర్నేషనల్ బోరర్ (ఐబీ) సమీపంలో డ్రోన్‌తో చిన్న సైజు ఆర్పీజీని పడేసి ఉండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అతను గతంలో చేసిన దాడులన్ని సరిహద్దు అవతల నుంచే ప్లాన్ చేసేవాడని చెబుతున్నారు. అంతేకాదు ఈ డ్రోన్లు ఒక పెద్ద సవాలని, వాటిని ఆపడానికి ఒక పద్ధతి ఉంటేగానీ ఇలాంటి ఘటనలను ఆపడం అసాధ్యం అని చెప్పారు. పైగా ఈ దాడి అధికారులను ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా దృష్టి సారించేలా చేసింది. ఇటీవల కాలంలో పంజాబ్‌లో ఇలాంటి ఘటను మూడు చోటు చేసుకోవడం గమనార్హం. (చదవడం: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు) -
జర చూసి తినండి: పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు
మారిన జీవనశైలితో ప్రజలు వండడం తగ్గించేసి ఆన్లైన్ ఫుడ్ యాప్‌లపై పడ్డారు. ఇట్ల ఆర్డర్ చేస్తే అలా ఇంటి గడప ముందుకు వస్తుండడంతో ప్రజలు బద్ధకస్తులై వంట గది వైపు చూడడం లేదు. ఇలా ఆన్లైన్లో వచ్చే ఆహారాన్ని కొంచెం చూసి తినాలి. ఫుడ్ యాప్‌లు అందిస్తున్న ఆహారంలో గతంలో ఎన్నోసార్లు ఆహారం సక్రమంగా లేకపోవడం.. పాడవడం.. లేదా ఇతర పదార్థాలు రావడం జరిగాయి. తాజాగా ఓ మహిళకు పిజ్జా ఆర్డర్ చేయగా పిజ్జాలో ఇనుప నట్లు.. బోల్టులు వచ్చాయి. అది చూసి నోరెళ్లబెట్టిన ఆమె వెంటనే ఫిర్యాదు చేయడంతో న్యాయం జరిగింది. ఈ సందర్భంగా ఆమె కొంచెం చూసి తినాలని సూచిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ‘అమ్మాయిలూ ‘జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) యూకే (ఇంగ్లాండ్)లోని లాంకషేర్ రాష్ట్రం థార్టన్ క్లెవెలెస్ జంట నగరాలకు చెందిన ఓ మహిళ గతనెల 29వ తేదీన డోమినోస్‌లో పిజ్జా ఆర్డర్ చేసింది. ఇంటికి చేరిన పిజ్జాను తీసుకుని తింటుండగ ఇనుప నట్లు, బోట్లు కనిపించాయి. ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురయ్యింది. వాటిని ఫొటో తీసి పెట్టుకుని డోమినోస్‌కు ఫిర్యాదు చేసింది. నట్లు, బోట్లు రావడంపై సంస్థ క్షమాపణ చెప్పింది. తన డబ్బులు చెల్లించమని అడగడంతో సంస్థ తిరిగి ఇచ్చేసింది. అయితే అంతకుముందే ఆమె ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. (చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో) మహిళ: ‘తినడానికి ముందు మీ పిజ్జాలను ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా థోర్టన్ క్లెవ్లీస్లోని డొమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె సూచించింది. డొమినోస్: ‘అసౌకర్యానికి క్షమాపణలు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు స్టోర్‌తో మాట్లాడాం. డొమినోస్ వినియోగదారుడి సంతృప్తి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇకపై ఇవి కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. -
పిజ్జా డెలివరీ రోబో ఇదిగో...
వస్తువులను వినియోగదారులకు అందించేందుకు డ్రోన్లను పరీక్షిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే డ్రోన్లను నిపుణులైన వారు నియంత్రించాలి. బాగా ఖరీదైన వ్యవహారం కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే డొమినోస్ పిజ్జా సంస్థ ఒక రోబోను రూపొందించింది. చిత్రంలో కనిపిస్తున్నది పిజ్జా డెలివరీ రోబో. డొమినోస్ ఔట్లెట్ నుంచి 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఏ చిరునామాకైనా ఇది పిజ్జాను తీసుకెళ్లి అందజేస్తుంది. ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసి చెల్లింపు చేశాక... ఈ డీఆర్‌యూ (డొమినోస్ రోబోటిక్ యూనిట్) రోబో ఆర్డరిచ్చిన వస్తువులను తీసుకొని బయలుదేరుతుంది. ఫుట్‌పాత్‌పై నిర్ణీత వేగంతో వెళుతుంది. నావిగేషన్ వ్యవస్థ ఆధారంగా డెలివరీ ఇవ్వాల్సిన చిరునామాకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో రోడ్డుపై ఏవైనా ఆటంకాలు ఎదురైనా ఇందులో అమర్చిన సెన్సర్ల సహాయంతో వాటిని గుర్తించి... పక్కకు జరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంటే దారిలో వచ్చిన దేన్నైనా ఢీ కొడుతుందనే భయం లేదు. పైగా ఇందులో పిజ్జాను వేడిగా, కూల్‌డ్రింక్స్‌కు చల్లగా ఉంచే ఏర్పాట్లున్నాయి. ఈ రోబో బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే... 20 కిలోమీటర్ల దూరం వెళ్లి పిజ్జాను డెలివరీ చేసి తిరిగి స్టోర్‌కు వచ్చేస్తుంది. ఈ డెలివరీ రోబో ప్రాజెక్టుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సహకారం అందిస్తోంది. మరో రెండేళ్లలో న్యూజిలాండ్‌లోని పట్టణాల్లో రోడ్లపై ఈ పిజ్జా డెలివరీ రోబోలను చూడొచ్చు. -
పిజ్జా డ్రోన్లపై పోలీసుల కన్నెర్ర
వినియోగదారుల ఇళ్లకు పిజ్జాలు పంపడానికి డ్రోన్లు ఉపయోగించడంపై ముంబై పోలీసులు కన్నెర్ర చేశారు. ఇలాంటి ప్రయోగాలు చేసేముందు ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదని, అనుమతులు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి కూడా సదరు పిజ్జా హౌస్ వాళ్లు అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్కోస్ పిజ్జెరియా అనే ఔట్లెట్ వాళ్లు ఇలా డ్రోన్ సాయంతో పిజ్జాలను డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. (చదవండి: ముంబైలోనూ డ్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ) అయితే ఏ వస్తువునైనా గాల్లోకి ఎగరేయాలంటే అందుకు ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఏటీసీ వర్గాలు చెబుతున్నాయి. రిమోట్ కంట్రోల్ సాయంతో ఎగరేసే ఇలాంటి వస్తువుల వల్ల భద్రతాపరమైన ముప్పు పొంచి ఉంటుందని, అందుకే ముందుగా అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. డ్రోన్ ప్రయోగానికి సంబంధించి తాము పూర్తి వివరాలు తీసుకుంటామని అదనపు పోలీసు కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు. ఇప్పటికే ఒకసారి ముంబై నగరంపై ఉగ్రవాద దాడి జరిగినందున.. భవిష్యత్తులో ఉగ్రవాద సంస్థలు కూడా ఇలాంటి మానవరహిత వాహనాలను దాడులకు ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.