జీ20 సమ్మిట్‌పై స్విగ్గీ ట్వీట్ ఇదే! | Swiggy Interesting Tweet About G20 Summit 2023 | Sakshi
Sakshi News home page

జీ20 సమ్మిట్‌పై స్విగ్గీ ట్వీట్ ఇదే! ఫిదా అవుతున్న నెటిజన్లు..

Published Mon, Sep 11 2023 10:22 AM | Last Updated on Mon, Sep 11 2023 10:42 AM

Swiggy Tweet About G20 Summit 2023 - Sakshi

దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సమ్మిట్ నిర్విఘ్నంగా ముగిసింది. ఈ సమావేశం గురించి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' (Swiggy) ఒక ఆసక్తికర ట్వీట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

 స్విగ్గీ తన క్రియేటివిటీ ప్రదర్శించి ఒక ప్లేట్ మధ్యలో టీ కప్పు.. దాని చుట్టూ పార్లే జీ బిస్కెట్లను అమర్చి, ఆ ఫోటో ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ 'మా పార్లే-జీ సమ్మిట్‌కు అందరూ ఆహ్వానితులే' అంటూ వెల్లడించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: రూ.5 వేల నుంచి రూ.100 కోట్లు వరకు - సామాన్యుడి సక్సెస్ స్టోరీ!

ఈ దృశ్యం ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది, వేలమంది దీనిని వీక్షించగా.. కొందరు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయని, టీతో పార్లే బిస్కెట్ తినటం మంచి అనుభూతి అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా జీ-సమ్మిట్ సమయంలో పటిష్టమైన భద్రతలలో భాగంగా డెలివరీ సంస్థలపై కూడా నిషేధం విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement