భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. పార్క్ ప్లస్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ఏర్పడటానికి కారణం ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పది నిమిషాల్లోపు ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. వినియోగదారులకు అందించడానికి ఈరోజు భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్‌ట్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ పార్క్ ప్లస్‌తో చేతులు కలిపింది. ఈ సౌలభ్యం ప్రస్తుతం 29 నగరాల్లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌ని నేరుగా వారి ఇంటి వద్దకే 10 నిమిషాల్లో డెలివరీ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చు.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ హెడ్ 'ఫణి కిషన్' మాట్లాడుతూ.. ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయడానికి బ్యాంక్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తారు. అయితే కార్డు డెలివరీ అండ్ యాక్టివేషన్ కోసం 3 నుంచి 7 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఫాస్ట్‌ట్యాగ్ అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. డెలివరీ కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుందని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి పార్క్ ప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అమిత్ లఖోటియా' మాట్లాడుతూ.. మా ప్రధాన లక్ష్యం కారు యజమానికి ఆనందాన్ని కలిగించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేసే వారు త్వరితగతిని డెలివరీ పొందటానికి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహకరిస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment