సెబీకి తాజా దరఖాస్తు దాఖలు
రూ. 10,000 కోట్లకుపైగా సమీకరణ!
న్యూఢిల్లీ: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 18.52 కోట్ల(అంచనా విలువ రూ. 6,665 కోట్ల) షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
వెరసి రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం స్విగ్గీ దాఖలు చేసిన రహస్య దరఖాస్తుకు ఈ వారం మొదట్లో సెబీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కాని్ఫడెన్షియల్ విధానంలో స్విగ్గీ ఏప్రిల్ 30న సెబీకి తొలుత దరఖాస్తు చేసింది. దీని తదుపరి తిరిగి అప్‌డేటెడ్ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. మూడు వారాలపాటు వీటిపై పబ్లిక్ నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆపై మరోసారి అప్‌డేటెడ్ సమాచారంతో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో రెండోసారి దరఖాస్తు చేశాక ఐపీవో చేపట్టేందుకు వీలుంటుందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి.
నిధుల వినియోగమిలా
ఐపీవో ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 137 కోట్లను అనుబంధ సంస్థ స్కూట్‌సీ రుణ చెల్లింపులకు, మరో రూ. 982 కోట్లు క్విక్ కామర్స్ విస్తరణలో భాగంగా డార్క్ స్టోర్ నెట్‌వర్క్ విస్తరణకు స్విగ్గీ వినియోగించనుంది. ఈ బాటలో రూ. 586 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ మౌలికసదుపాయాలకు, రూ. 930 కోట్లు బ్రాండ్ మార్కెటింగ్‌పైనా వెచి్చంచనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 ఏప్రిల్‌కల్లా 13 బిలియన్ డాలర్ల విలువను సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment