దొంగతనం చేసిన డెలివరీ బాయ్‌కు సపోర్ట్‌.. సోనూసూద్‌పై ట్రోలింగ్‌ | Trolling On Sonu Sood For Supporting Swiggy Delivery Guy Who Stole Customers Shoes | Sakshi
Sakshi News home page

అవసరం ఉందేమో.. దొంగకు సాయం చేయండన్న నటుడు.. నెట్టింట ట్రోలింగ్‌

Published Sat, Apr 13 2024 5:56 PM | Last Updated on Sat, Apr 13 2024 6:26 PM

Trolling On Sonu Sood For Supporting Swiggy Delivery Guy Who Stole Customers Shoes - Sakshi

స్విగ్గీ డెలివరీ బాయ్‌ ఫుడ్‌ ఇవ్వడానికి వెళ్లి.. సదరు ఇంటి ముందు షూ దొంగిలించిన ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 9న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రముఖ నటుడు సోనూసూద్‌ పాజిటివ్‌గా స్పందించాడు. 'మీకు ఫుడ్‌ తీసుకొచ్చే క్రమంలో డెలివరీ బాయ్‌ షూలు ఎత్తుకెళ్లిపోతే తిట్టుకోకండి.. దయచేసి తనమీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వీలైతే అతడికి కొత్త షూలు కొనివ్వండి. బహుశా అతడికి అవి ఎంతో అవసరమయి ఉండొచ్చు. దయతో ప్రవర్తించండి' అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు సోనూసూద్‌ను విమర్శిస్తున్నారు.

'దొంగతనం చేస్తే ఏమీ అనకూడదా? పేదరికం, అవసరం ఉన్నంతమాత్రాన దొంగిలిస్తే తప్పు ఒప్పయిపోతుందా? ఈ డెలివరీ బాయ్‌ కంటే పేదవాళ్లు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ తమ కష్టార్జితంతో బతుకుతున్నారే తప్ప ఇలా పక్కవాళ్ల వస్తువులు దొంగలించిట్లేదు' అని ఓ వ్యక్తి నటుడిపై విరుచుకుపడ్డాడు. 'ఎవరైనా బంగారు గొలుసు దొంగిలించినా ఏం పర్లేదని వదిలేయాలా? అతడికి కారు అవసరమనుకోండి.. ఎవరిదో ఒకరిది ఎత్తుకుపోతే సరిపోతుందా? పేదరికంలో ఉన్నంతమాత్రాన దొంగతనం తప్పు కాకుండా పోతుందా?' అని ట్రోల్‌ చేస్తున్నారు. 

చదవండి: సల్మాన్‌ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement