యువ ఉద్యోగులు, పనిగంటలపై ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలామంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ నారాయణ మూర్తికి మద్దతుగా నిలిచాయి. అటు మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ముఖ్యంగా ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా మూర్తి వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. ఇంటా, బయటా అలుపెరగకుండా పనిచేస్తున్నా కూడా, వారికి తగిన గుర్తింపు లభించడం లేదనీ, దీనికి గురించి ఎవరూ మాట్లాడక పోవడం విచారకరమంటూ ట్వీట్ చేశారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్ )
తాజాగా వ్యాపారవేత్త హర్హ్ గోయెంకా నారాయణ మూర్తి చెప్పినట్టుగా భావిస్తున్న వారానికి 70 గంటల పనివిధానం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
🚀 The 5-day office week is dead! 🏢 People are working nearly 33% of their office time remotely, and it's a game-changer. Flexibility is worth as much to people as an 8% raise. 💰 What we value most is skipping the daily commute and the sense of flexibility! 🚗🚆
— Harsh Goenka (@hvgoenka) October 30, 2023
🌟 Hybrid work…
హర్ష్ గోయెంకా ఏమన్నారంటే.. ‘‘వారానికి 5 రోజుల ఆఫీస్ పని విధానానికి కాలం చెల్లింది. ఆఫీసు పనిలో దాదాపు 33 శాతం రిమోట్‌గా పని చేస్తున్నారు. ఇదోక గేమ్-ఛేంజర్. 8 శాతం ప్రొడక్టవిటీని పెంచే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. అలాగే ఆఫీసులకు రోజువారి రాకపోకల్ని నివారించడం, ఫ్లెక్సిబిలీటీ అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.’’
ప్రస్తుతం జరుగుతోంది.. భవిష్యత్తు అంతా హైబ్రిడ్ పని విధానమే. కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుంచా ,రిమోట్‌గానే అనే దానికి మిళితం చేసుకోవాలి. అంతే తప్ప 50-70 గంటలా అనేది కాదు చర్చ. దీనికి బదులుగా మన లక్ష్యం, ప్రయోజనాలు, ఉత్పదకత గురించి ఆలోచించాలి. మార్పును స్వాగతించాల్సిందే.. కొత్త వర్క్ ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా మారాలి. వర్క్ లైఫ్‌లో వర్క్ ఫ్రం హోం, లేదా ఆఫీసా అనే దాంట్లో నిజంగా ముఖ్యమైన దాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది! అంటూ పరోక్షంగా నారాయణమూర్తికి కౌంటర్ ఇచ్చారు.
ఇది ఇలా ఉంటే ఇన్పీ మూర్తి మద్దతుగా టెక్ మహీంద్రా సీఈవో పీ గుర్నానీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఆయా కంపెనీల కోసం 70 గంటలు పనిచేయడం గురించి మాట్లాడడం లేదని, వ్యక్తులుగా తమ కోసం లేదా తమ దేశ అభివృద్ధి కోసం 70 గంటలు పనిచేయాలని సూచించాలని గుర్నాని అన్నారు. అంతేకాదు యువత తాము ఎంచుకున్న రంగంలో మాస్టర్‌గా మారాలంటే యువత 10 వేల గంటలను పెట్టుబడిగా పెట్టాలని కూడా గుర్నాని పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment