counters
-
ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు షాక్
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్
-
ఆదేశాలిచ్చినా కౌంటర్లు వేయరా?
సాక్షి, అమరావతి: తగినంత సమయం ఇస్తున్నా, ఆయా కేసుల్లో అధికారులు కౌంటర్లు దాఖలు చేయకపోతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విషయంలో అధికారులు మందకొడిగా ఉన్నారని, ఇలా నిద్రపోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లాలో లైమ్ స్టోన్ ఖనిజం ఉన్న భూములను అసైన్మెంట్ కింద భూమి లేని పేదలకు ఇస్తున్నారని, దీని వెనుక బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) ఉన్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ అప్పటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే) 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం అన్ని వివరాలతో మెరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. గతంలో ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు కాలేదని తెలుసుకున్న ధర్మాసనం ‘అసలు మీరు (అధికారులు) కోర్టును సీరియస్‌గా తీసుకుంటున్నారా.. లేదా?’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నామని, అయితే అసాధారణ జాప్యానికి గాను కేంద్ర కార్యదర్శికి రూ.20 వేలు, కలెక్టర్‌కు సైతం రూ.10 వేలు ఖర్చులు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వొకేట్స్ క్లర్కుల సంక్షేమ నిధిలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇలా జాప్యం చేసే ప్రతి కేసులోనూ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి మెరుగైన అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
పిచ్చి కుక్కల అరుపులకు అదిరేది లేదు... బెదిరేది లేదు
-
సభలో సీఎం జగన్ బాబుకు వేసిన బలమైన కౌంటర్లు
-
తుమ్మల వర్సెస్ పువ్వాడ..పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్‌లో ఖమ్మం నియోజకవర్గం హాట్ సెగ్మెంట్‌గా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఖమ్మం నగరంలోని 50వ డివిజన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు.ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ దొంగల పాలయిందన్నారు. సామాన్యుడు ఒక ప్లాటు కొనుక్కుంటే దాన్ని కూడా ఎప్పుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా నగరంలో తయారైందన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి ఖమ్మం నగర ప్రజలు బయట పడాలంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలని తుమ్మల కోరారు. తుమ్మల వ్యాఖ్యలకు అదే స్థాయిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ. ఖమ్మం 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం, పాలేరు ప్రజలు ఇంటికి పంపిస్తే మళ్ళీ పొర్లు దండాలు పెడుతూ ఖమ్మంలో తిరుగుతున్నావని తుమ్మలను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్పప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారాన్ని అనుభవించి ప్రజలను బూతు పురాణంతో భయ బ్రాంతులకు గురి చెయ్యడం తప్ప తుమ్మల చేసిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల పాటు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారో అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని,ఇదే నా మీరు చెప్పే నీతి నిజాయితీ అని ప్రశ్నించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు తనవైపే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పువ్వాడ. -
హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ
యువ ఉద్యోగులు, పనిగంటలపై ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలామంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ నారాయణ మూర్తికి మద్దతుగా నిలిచాయి. అటు మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా మూర్తి వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. ఇంటా, బయటా అలుపెరగకుండా పనిచేస్తున్నా కూడా, వారికి తగిన గుర్తింపు లభించడం లేదనీ, దీనికి గురించి ఎవరూ మాట్లాడక పోవడం విచారకరమంటూ ట్వీట్ చేశారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్ ) తాజాగా వ్యాపారవేత్త హర్హ్ గోయెంకా నారాయణ మూర్తి చెప్పినట్టుగా భావిస్తున్న వారానికి 70 గంటల పనివిధానం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 🚀 The 5-day office week is dead! 🏢 People are working nearly 33% of their office time remotely, and it's a game-changer. Flexibility is worth as much to people as an 8% raise. 💰 What we value most is skipping the daily commute and the sense of flexibility! 🚗🚆 🌟 Hybrid work… — Harsh Goenka (@hvgoenka) October 30, 2023 హర్ష్ గోయెంకా ఏమన్నారంటే.. ‘‘వారానికి 5 రోజుల ఆఫీస్ పని విధానానికి కాలం చెల్లింది. ఆఫీసు పనిలో దాదాపు 33 శాతం రిమోట్‌గా పని చేస్తున్నారు. ఇదోక గేమ్-ఛేంజర్. 8 శాతం ప్రొడక్టవిటీని పెంచే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. అలాగే ఆఫీసులకు రోజువారి రాకపోకల్ని నివారించడం, ఫ్లెక్సిబిలీటీ అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.’’ ప్రస్తుతం జరుగుతోంది.. భవిష్యత్తు అంతా హైబ్రిడ్ పని విధానమే. కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుంచా ,రిమోట్‌గానే అనే దానికి మిళితం చేసుకోవాలి. అంతే తప్ప 50-70 గంటలా అనేది కాదు చర్చ. దీనికి బదులుగా మన లక్ష్యం, ప్రయోజనాలు, ఉత్పదకత గురించి ఆలోచించాలి. మార్పును స్వాగతించాల్సిందే.. కొత్త వర్క్ ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా మారాలి. వర్క్ లైఫ్‌లో వర్క్ ఫ్రం హోం, లేదా ఆఫీసా అనే దాంట్లో నిజంగా ముఖ్యమైన దాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది! అంటూ పరోక్షంగా నారాయణమూర్తికి కౌంటర్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇన్పీ మూర్తి మద్దతుగా టెక్ మహీంద్రా సీఈవో పీ గుర్నానీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఆయా కంపెనీల కోసం 70 గంటలు పనిచేయడం గురించి మాట్లాడడం లేదని, వ్యక్తులుగా తమ కోసం లేదా తమ దేశ అభివృద్ధి కోసం 70 గంటలు పనిచేయాలని సూచించాలని గుర్నాని అన్నారు. అంతేకాదు యువత తాము ఎంచుకున్న రంగంలో మాస్టర్‌గా మారాలంటే యువత 10 వేల గంటలను పెట్టుబడిగా పెట్టాలని కూడా గుర్నాని పిలుపు నిచ్చారు. -
పిసుక్కుంటున్న రేవంత్, తలసాని
-
అగ్రిమెంట్ లోని అంశాలను గుర్తు చేస్తోన్న జేపీఎస్ లు
-
అమిత్ షాకు వరుసగా కౌంటర్లు
-
దుష్ట చతుష్టయానికి రైతుల సవాల్
-
దేశీ లిక్కర్ తాగారా? అంటే.. అమితాబ్ రిప్లై ఇది!
ముంబై: సెలబ్రిటీలకు విమర్శలు, ఇంటర్నెట్ ట్రోలింగ్ కొత్తేం కాదు. అయితే ట్రోలింగ్‌కు అంతే దీటుగా బదులివ్వడం బచ్చన్ ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉంది. తాజాగా సీనియర్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో ఊహించని అనుభవం ఎదురైంది. ముసలోడు.. తాగుబోతు అంటూ నోటికొచ్చినట్లు ఆయన ఫేస్బుక్ వాల్‌పై కామెంట్లు చేశారు కొందరు. అయితే పెద్దాయన మాత్రం ఓపికగా ఆ విమర్శలకు చాలా చాలా హుందాగా కౌంటర్లు ఇస్తూ వెళ్లారు. విషయం ఏంటంటే.. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో(ఫేస్బుక్లో) గుడ్‌మార్నింగ్ పోస్ట్ చేశారు. కాకపోతే అది కాస్త ఆలస్యం అయ్యింది. ఉదయం 11.26కి ఆయన గుడ్ మార్నింగ్ పోస్ట్ పెట్టారు. ఇదే విమర్శలకు కారణమైంది. దీంతో చాలావరకు కామెంట్లకు అంతే ఓపికగా సమాధానం ఇస్తూ వెళ్లారు ఆయన. బహుశా దేశీ లిక్కర్ తాగి ఉంటాడేమో అందుకే.. ఈ టైంకి గుడ్ మార్నింగ్ పెట్టాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి అమితాబ్ స్పందిస్తూ.. తాను అసలు తాగనని చెబుతూ.. తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన మధుశాలలోని ఓ లైన్ పోస్ట్ చేశారు. మరి ఈ టైంలో గుడ్ మార్నింగ్ఏంటని మరో వ్యక్తి ప్రశ్నించగా.. లేట్ నైట్ షూటింగ్‌తో ఆలస్యం అయ్యిందని, అది పూర్తయ్యే సరికి ఉదయం అయ్యిందని, ఆలస్యంగా లేచినందుకే పోస్ట్ చేశానంటూ బదులిచ్చారాయన. ఇక అగౌరవంగా కామెంట్లు చేసిన వాళ్లకు సైతం అంతే ఘాటుగా బదులిచ్చారు. ‘ఇది మధ్యాహ్నాం రా ముసలోడా..’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘దీర్ఘకాలం నువ్వు జీవించాలంటూ ఆశీర్వదించిన అమితాబ్.. నిన్ను మాత్రం ఎవరూ ముసలోడా అంటూ పిలిచి అవమానించకూడదంటూ కోరుకుంటున్నట్లు’’ కౌంటర్ ఇచ్చారు బిగ్ బీ. ఇలా ఎవరైతే తనపై సెటైర్లు వేసేందుకు ప్రయత్నించారో.. వాళ్లందరిపైనా ఆయన తన వాక్ చాతుర్యం ప్రదర్శించారు. విలువలేని సూపర్‌స్టార్ అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. పని వల్ల లేచేసరికి ఆలస్యం అయ్యింది ‘విలువైన మనిషి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా.. చాలావరకు ఓపికగా ట్రోలింగ్‌కు కౌంటర్లు వేస్తూ వెళ్లారు 79 ఏళ్ల అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఆయన రణ్‌బీర్ కపూర్-అలియాభట్ ‘బ్రహ్మస్త్ర’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: తండ్రి అమిర్ ఖాన్ ముందే బికినీలో కేక్ కటింగ్.. ట్రోలింగ్‌పై కౌంటర్ -
ఇంటికే బస్ పాస్
-
కన్నడ రాజకీయాలపై చంద్రబాబు ట్వీట్‌కు కౌంటర్లు
-
‘స్కానింగ్’ తిప్పలు
వందలకొద్దీ ఫైళ్లు గంటల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగులు ఇందూరు : జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా మొన్నటి వరకు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు ఫైళ్లతో కుస్తీ పడితే... ఇప్పుడు వాటిని స్కానింగ్ చేయించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాల విభజన గడువు సమీపిస్తుండడంతో ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు. అయితే కలెక్టరేట్ పరిపాలన విభాగంలో మాత్రమే స్కానింగ్ యంత్రాలున్నాయి. ఇతర కార్యాలయాల్లో సరైన పరికరాలు లేకపోవడంతో.. వారం క్రితం కలెక్టర్ కార్యాలయంలోని అక్షర ప్రణాళిక భవన్ వద్ద రెండు స్కానింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతలను కలెక్టరేట్ అధికారులు టెండర్లు నిర్వహించి ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులు ఫైళ్లను తీసుకుని వచ్చి ఆయా కౌంటర్ల వద్ద స్కానింగ్ చేయిస్తున్నారు. అయితే రెండే కౌంటర్లు ఉండడంతో పని వేగంగా జరగడం లేదు. దీంతో ఉద్యోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో శాఖలో వందల ఫైళ్లు సుమారు వారం రోజుల పాటు ఆయా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు శ్రమించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వారీగా ఫైళ్లను విభజించారు. సుమారు నాలుగు దశాబ్దాల ఫైళ్లను స్కానింగ్ చేయిస్తున్నారు. ఒక్కో శాఖలో వందల సంఖ్యలో ఫైళ్లున్నాయి. వాటిని అన్నింటినీ స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయడం ఉద్యోగులకు కత్తిమీద సాములా తయారయ్యింది. రెండే కౌంటర్లు ఉండడంతో గంటలకొద్దీ సమయం స్కానింగ్ కౌంటర్ వద్దే గడిచిపోతోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లాల విభజన గడువు సమీపించడంతో ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తే పనిలో వేగం పెరుగుతుందంటున్నారు. -
పవన్ వ్యాఖ్యల పై టీడీపీ,బీజేపీ కౌంటర్లు
-
జనంతో మమేకం
కుప్పంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి ఉదయుం నుంచి సాయుంత్రం దాకా జనంతోనే.. అర్జీలతో బారులు తీరిన ప్రజలు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సోమవారం రోజంతా జనంతో మమేకమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. జిల్లాలో మొదటిసారి కలెక్టర్ సిద్ధార్థజైన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం కుప్పంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు నియోజకవర్గం నలువుూలలనుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కుప్పం: కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సోవువారం ఉదయుం 11గంటలకు ప్రారంభమైన అర్జీల స్వీకరణ సాయుం త్రం ఆరు గంటల వరకు కొనసాగింది. వుండల సచివాలయు సవూవేశ వుందిరంలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశా రు. తవు సవుస్యలు పరిష్కరించుకునేందుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టర్ నేరుగా వూట్లా డి అర్జీలు స్వీకరించారు. మొదటగా రేషన్‌కార్డులు, పింఛన్లు, హౌసింగ్ శాఖల వారీగా ఫిర్యాదులు తీసుకున్నారు. శాఖలవారీగా విభజించి జిల్లాస్థాయి అధికారులకు అందజేసి అప్పటికప్పుడే పరిష్కరించాల ని ఆదేశించారు. వీటిలో సాంకేతిక ఇబ్బందులు ఉన్న వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై తక్షణం స్పందించిన కలెక్టర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ను సవుస్య పరిష్కరించాలని ఆదేశించారు. భారీగా వచ్చిన ప్రజల సౌకర్యార్థం కుర్చీ లు, షామియూనాలు ఏర్పాటుచేశారు. పోలీసులు ఫిర్యాదుదారులను వరుసక్రవుంలో కలెక్టర్ వేదిక వద్దకు పంపించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న సవూవేశ వుందిరంలో కేవలం జిల్లాస్థాయి అధికారులను వూత్రమే అనువుతించారు. నియోజకవర్గ స్థారుు అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రవుంలో వుదనపల్లె సబ్ కలెక్టర్ నారాయుణ భరత్ గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సరుకే లేదు..సరసమైన ధరలా!
నెల్లూరు(టౌన్): ‘నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. ఈ ధరలు దిగి వచ్చేంత వరకు పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో బియ్యంతో పాటు ఎర్రగడ్డలు, కూరగాయలను సరసమైన ధరలకు విక్రయిస్తాం. ప్రత్యేక కౌంటర్లను ప్రజలు వినియోగించుకోవాలి.’ మూడు రోజుల క్రితం నెల్లూరులోని రైతుబజార్లో ఎర్రగడ్డల కౌంటర్ ప్రారంభం సందర్భంగా జాయింట్ కలెక్టర్ రేఖారాణి అన్న మాటలివి. ఇదం తా నిజమేనని తెలిసి కౌంటర్ల వద్దకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఎప్పుడు వచ్చినా సరుకులు లేవనే సమాధానమే వస్తోంది. ఈ విక్రయ కేంద్రాలకు అరకొరగా సరుకులు తీసుకొస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకే ఫత్తేఖాన్‌పేట రైతుబజార్‌లోని కౌంటర్లో ఎర్రగడ్డలు అయిపోయాయి. కూరగాయలు కూడా రెండు, మూడు కిలోలు మాత్రమే ఉన్నాయి. మంగళవారం కూడా అదే పరిస్థితి. ఉదయం 10.50 గంటల సమయంలో ఎర్రగడ్డలు కేవలం నాలుగైదు కిలోలు మాత్రమే ఉన్నాయి. 6 బస్తాల ఎర్రగడ్డలు తెచ్చామని, వాటిలో రెండు మొబైల్ విక్రయ కేంద్రాల ద్వారా కాలనీలకు తీసుకెళ్లామని సిబ్బంది తెలిపారు. మళ్లీ ఎప్పుడు తెస్తారని అడిగితే ఇక రేపే కదా..అని సమాధానమిస్తున్నారు. నవాబుపేట రైతుబజారులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బియ్యం నాణ్యతపై విమర్శలు ఎర్రగడ్డలు, కూరగాయల విక్రయాల పరిస్థితి అలా ఉంటే, సన్నబియ్యం విక్రయ కేంద్రాల పరిస్థితి మరోలా ఉంది. నాణ్యమైన సన్న బియ్యాన్ని కిలో రూ.30కే విక్రయిస్తామని అధికారులు రైతుబజార్లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే బియ్యంలో నాణ్యత కొరవడిందని ఆరోపిస్తూ ప్రజలు కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో మాత్రం నాణ్యమైన బియ్యం ఉంచి, మిగిలిన సమయాల్లో కల్తీ బియ్యం అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో బియ్యం విక్రయ కేం ద్రాలు వెలవెలబోతున్నాయి. ఈ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగితే తమకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు లభిస్తాయని వినియోగదారులు ఆశిస్తున్నారు.