జనంతో మమేకం
- కుప్పంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి
- ఉదయుం నుంచి సాయుంత్రం దాకా జనంతోనే..
- అర్జీలతో బారులు తీరిన ప్రజలు
జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సోమవారం రోజంతా జనంతో మమేకమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. జిల్లాలో మొదటిసారి కలెక్టర్ సిద్ధార్థజైన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం కుప్పంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు నియోజకవర్గం నలువుూలలనుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
కుప్పం: కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సోవువారం ఉదయుం 11గంటలకు ప్రారంభమైన అర్జీల స్వీకరణ సాయుం త్రం ఆరు గంటల వరకు కొనసాగింది. వుండల సచివాలయు సవూవేశ వుందిరంలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశా రు. తవు సవుస్యలు పరిష్కరించుకునేందుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టర్ నేరుగా వూట్లా డి అర్జీలు స్వీకరించారు. మొదటగా రేషన్‌కార్డులు, పింఛన్లు, హౌసింగ్ శాఖల వారీగా ఫిర్యాదులు తీసుకున్నారు.
శాఖలవారీగా విభజించి జిల్లాస్థాయి అధికారులకు అందజేసి అప్పటికప్పుడే పరిష్కరించాల ని ఆదేశించారు. వీటిలో సాంకేతిక ఇబ్బందులు ఉన్న వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై తక్షణం స్పందించిన కలెక్టర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ను సవుస్య పరిష్కరించాలని ఆదేశించారు. భారీగా వచ్చిన ప్రజల సౌకర్యార్థం కుర్చీ లు, షామియూనాలు ఏర్పాటుచేశారు.
పోలీసులు ఫిర్యాదుదారులను వరుసక్రవుంలో కలెక్టర్ వేదిక వద్దకు పంపించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న సవూవేశ వుందిరంలో కేవలం జిల్లాస్థాయి అధికారులను వూత్రమే అనువుతించారు. నియోజకవర్గ స్థారుు అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రవుంలో వుదనపల్లె సబ్ కలెక్టర్ నారాయుణ భరత్ గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.