Public Grievances
-
అవినీతిపై రోజుకు 195 ఫిర్యాదులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతికి తగ్గట్లు ప్రజా ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీపీగ్రామ్స్) ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. అవినీతికి సంబంధించి ఏకంగా 46,627 ఫిర్యాదులు ఈ పోర్టల్ ద్వారా అందినట్లు ఆగస్టు–2022 నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన రోజుకు 195 ఫిర్యాదులు దఖలుపడ్డాయి. అత్యధికంగా ఫిర్యాదులు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్)పైనే నమోదవడం గమనార్హం. డీఎఫ్ఎస్ పరిధిలోని బ్యాంకింగ్ విభాగంపై అధికంగా 14,934 ఫిర్యాదులు వచ్చాయి. బీమా విభాగంపై 3,306 ఫిర్యాదులు, సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ)పై 2,223, శాస్త్ర,సాంకేతిక విభాగంపై 1,831, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంపై 1,784, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖపై 1,005 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25 వరకు సీపీగ్రామ్స్ ద్వారా కేంద్రప్రభుత్వానికి మొత్తంగా 7,50,822 ఫిర్యాదులు అందాయి. వీటిలో 7,27,673 ఫిర్యాదులను పరిష్కరించారు. బ్యాంకింగ్ విభాగంలో 1,088, కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖలో 260 ఫిర్యాదుల్ని పరిష్కరించాల్సి ఉంది. -
సమస్యలుంటే నాకు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం మధ్య వారధిగా ఉండేందుకు జనం నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలపై వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు దాతల సాయం తీసుకుంటామన్నారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలను స్వయంగా కలుసుకుంటానని, వారి సమస్యలను వినడంతో పాటు అర్జీలను స్వీకరించి ప్రభుత్వ శాఖల సహకా రంతో పరిష్కారానికి కృషి చేస్తానని గవర్నర్ గతం లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఏర్పా ట్లను సైతం గతంలో చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారంలో పురోగతిని సమీక్షించడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. కరోనా వ్యాప్తితో అప్పట్లో ఈ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించలేకపోయారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజాదర్బార్‌కు బదులు డ్రాప్ బాక్స్ (ఫిర్యాదుల పెట్టె్ట) ద్వారా సామాన్య ప్రజల నుంచి విన్నపాలు, సలహాలు గవర్నర్ స్వీకరించనున్నారు. రాజ్‌భవన్ బయట ప్రవేశ ద్వారం వద్ద డ్రాప్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించడంతో పాటు వాటి పరిష్కారానికి రాజ్‌భవన్ కృషిచేస్తుందని వెల్లడించారు. రాజ్‌భవన్ పరివార్ సభ్యుల కోసం... రాజ్‌భవన్ పరివార్ సభ్యుల నుంచి అర్జీలను స్వీక రించేందుకు లోపల మరో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా శని వారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం లో ఆమె ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 21 మంది దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. సేవా ఇంటర్నేషనల్ సంస్థ ఈ ల్యాప్‌టాప్ లను విరాళంగా అందజేసింది. అనంతరం డ్రాప్ బాక్స్‌లను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో 100 శాతం తొలి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు ప్రభుత్వాన్ని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ప్రశంసించారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసు కోవాలని ప్రజలకు సూచించారు. పాశ్చాత్య ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలని, సంప్రదాయ ఆహారాన్ని స్వీకరించాలని కోరారు. -
ఇక ప్రభుత్వంపై పోరాటమే
క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్ ఇచ్చిన హామీల వైఫల్యం, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్న క్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రైతులు, యువత, విద్యార్థులు, దళితులు, మైనారిటీలకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు, వైఫల్యం తది తరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొందరికి బాధ్యతలు అప్పగించారు. లక్ష లోపు పంట రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పటిదాకా కేవలం రెండు విడతలే చేయడంపై రైతుల అభిప్రాయాలను సేకరించనుంది. దళితులకు మూడెకరాల భూమి హామీ అమలుపై గ్రామాల్లో పరిస్థితులను తెలుసుకోనుంది. కేజీ టు పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య, లక్ష ఉద్యోగాల కల్పన, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితరాలపైనా నివేదికను తెప్పించుకోనుంది. అనంతరం అంశాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఉత్తమ్ యోచి స్తున్నారు. ఇతర పార్టీలను, వివిధ ప్రజా సంఘాలను క్షేత్రస్థాయి సమరంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్తగా తలెత్తే సమస్యలు, ప్రభుత్వ కదలికలను బట్టి కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు. -
ప్రభుత్వంపై రాజీలేని పోరాటం
ఉరవకొండ: మోసపు హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక తొగట వీరక్షత్రియ కళ్యాణమండలంలో శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీ కిసాన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు అశోక్ అధ్యక్షత వహించారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఐదు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. జిల్లాలో ఏర్పడి కరువు పరిస్థితిలో రుణమాఫీ కాక, కొత్త రుణాలు అందక రైతులు అవస్థపడుతున్నారన్నారు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ముఖ్య మంత్రి ఓ వైపు చెబుతున్నారన్నారు. మరోవైపు బంగారు తాకట్టు రుణాలతోపాటు, వ్యవసాయ రుణాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయన్నారు. నాలుగేళ్లలో డ్వాక్రా రుణాలు కూడా దశల వారీగా లక్షన్నర రూపాయలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చావుకబరు చల్లగా చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మెడలు వంచేందుకు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా భాగస్వామ్యంతో ఆందోళనలు చేపడతామన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.వుధుసూదన్‌రెడ్డి వూట్లాడుతూ రుణవూఫీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ వుండల కేంద్రాల్లో ఈ నెల 16 ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, డ్వాక్రా సంఘాలతోపాటు పింఛన్ జాబితా నుంచి తొలగించబడిన లబ్ధిదారులందరూ ధర్నాకు తరలిరావాలని పిలుపు నిచ్చారు. తొమ్మిదేళ్ల బాబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, తిరిగి వారికి అవే కష్టాలు మొదలయ్యూయుని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పక్షాన తమ పార్టీ రాజీలేని పోరాటాలు సాగిస్తుందన్నారు. వుహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ మాట్లాడుతూ వుహిళా సంఘాల రుణవూఫీ అయ్యేవరుకు దశల వారీగా ఆందోళనలు చేపడతావున్నారు. యుువజన విభాగం జిల్లా కార్యదర్శి ప్రణయ్కువూర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు సింగాడి తిప్పయ్యు, మేరి నిర్మలవ్ము, మీనుగ లలిత, ఎంపీపీలు కొర్ర వెంకటవ్ము, వుహేశ్వరీ, అధికార ప్రతినిధి వీరన్న, మైనార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శర్మాస్ ఖాన్, ఉపసర్పంచ్ జిలకరమోహన్, సర్పంచ్‌లు, వుండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాలు, వుహిళా వుండల కన్వీనర్లు పాల్గొన్నారు. -
జనంతో మమేకం
కుప్పంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి ఉదయుం నుంచి సాయుంత్రం దాకా జనంతోనే.. అర్జీలతో బారులు తీరిన ప్రజలు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సోమవారం రోజంతా జనంతో మమేకమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. జిల్లాలో మొదటిసారి కలెక్టర్ సిద్ధార్థజైన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం కుప్పంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు నియోజకవర్గం నలువుూలలనుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కుప్పం: కుప్పంలో కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సోవువారం ఉదయుం 11గంటలకు ప్రారంభమైన అర్జీల స్వీకరణ సాయుం త్రం ఆరు గంటల వరకు కొనసాగింది. వుండల సచివాలయు సవూవేశ వుందిరంలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశా రు. తవు సవుస్యలు పరిష్కరించుకునేందుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టర్ నేరుగా వూట్లా డి అర్జీలు స్వీకరించారు. మొదటగా రేషన్‌కార్డులు, పింఛన్లు, హౌసింగ్ శాఖల వారీగా ఫిర్యాదులు తీసుకున్నారు. శాఖలవారీగా విభజించి జిల్లాస్థాయి అధికారులకు అందజేసి అప్పటికప్పుడే పరిష్కరించాల ని ఆదేశించారు. వీటిలో సాంకేతిక ఇబ్బందులు ఉన్న వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదుపై తక్షణం స్పందించిన కలెక్టర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్‌ను సవుస్య పరిష్కరించాలని ఆదేశించారు. భారీగా వచ్చిన ప్రజల సౌకర్యార్థం కుర్చీ లు, షామియూనాలు ఏర్పాటుచేశారు. పోలీసులు ఫిర్యాదుదారులను వరుసక్రవుంలో కలెక్టర్ వేదిక వద్దకు పంపించారు. ప్రజావాణి నిర్వహిస్తున్న సవూవేశ వుందిరంలో కేవలం జిల్లాస్థాయి అధికారులను వూత్రమే అనువుతించారు. నియోజకవర్గ స్థారుు అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రవుంలో వుదనపల్లె సబ్ కలెక్టర్ నారాయుణ భరత్ గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.