ప్రభుత్వంపై రాజీలేని పోరాటం
ఉరవకొండ:
మోసపు హామీలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వై మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక తొగట వీరక్షత్రియ కళ్యాణమండలంలో శనివారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీ కిసాన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు అశోక్ అధ్యక్షత వహించారు.
విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఐదు నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. జిల్లాలో ఏర్పడి కరువు పరిస్థితిలో రుణమాఫీ కాక, కొత్త రుణాలు అందక రైతులు అవస్థపడుతున్నారన్నారు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ముఖ్య మంత్రి ఓ వైపు చెబుతున్నారన్నారు. మరోవైపు బంగారు తాకట్టు రుణాలతోపాటు, వ్యవసాయ రుణాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయన్నారు.
నాలుగేళ్లలో డ్వాక్రా రుణాలు కూడా దశల వారీగా లక్షన్నర రూపాయలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చావుకబరు చల్లగా చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మెడలు వంచేందుకు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా భాగస్వామ్యంతో ఆందోళనలు చేపడతామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వై.వుధుసూదన్‌రెడ్డి వూట్లాడుతూ రుణవూఫీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ వుండల కేంద్రాల్లో ఈ నెల 16 ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రైతులు, డ్వాక్రా సంఘాలతోపాటు పింఛన్ జాబితా నుంచి తొలగించబడిన లబ్ధిదారులందరూ ధర్నాకు తరలిరావాలని పిలుపు నిచ్చారు. తొమ్మిదేళ్ల బాబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, తిరిగి వారికి అవే కష్టాలు మొదలయ్యూయుని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పక్షాన తమ పార్టీ రాజీలేని పోరాటాలు సాగిస్తుందన్నారు. వుహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ మాట్లాడుతూ వుహిళా సంఘాల రుణవూఫీ అయ్యేవరుకు దశల వారీగా ఆందోళనలు చేపడతావున్నారు.
యుువజన విభాగం జిల్లా కార్యదర్శి ప్రణయ్‌కువూర్‌రెడ్డి, జడ్‌పీటీసీ సభ్యులు సింగాడి తిప్పయ్యు, మేరి నిర్మలవ్ము, మీనుగ లలిత, ఎంపీపీలు కొర్ర వెంకటవ్ము, వుహేశ్వరీ, అధికార ప్రతినిధి వీరన్న, మైనార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శర్మాస్ ఖాన్, ఉపసర్పంచ్ జిలకరమోహన్, సర్పంచ్‌లు, వుండల కన్వీనర్లు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాలు, వుహిళా వుండల కన్వీనర్లు పాల్గొన్నారు.