harward business school
-
ఆ విషయం గురించి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కూడా ఇలా చెప్పలేరు
చుట్టూ కనిపించే విషయాల నుంచే చక్కని బిజినెస్ పాఠాలు చెప్పడం ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా స్పెషాలిటీ. ముఖ్యంగా మనకు తెలియకుండా సాధారణంగా చేసే పనుల్లో ఎంతో విలువైన వ్యాపార సూత్రాలు దాగి ఉంటాయి. అలాంటి అంశాలకు సంబంధఙంచిన ఓ వీడియోను తాజాగా ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు పిల్లలు ఒకే సారి సైకిల్ తొక్కుతూ ముందుకు పోతుంటారు. సైకిల్‌కి ఉండే రెండు పెడల్స్‌పై చేరోవైపునా ఇద్దరు నిలబడి సైకిల్ ముందుకు కదిలేందుకు అవసరమైన ఫోర్స్‌ను అందిస్తుంటారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా కొలాబరేషన్, టీమ్ వర్క్‌లతో ఉపయోగం ఏంటో వివరించేందుకు ఇంతకంటే మంచి వీడియోను హార్వర్డ్ యూనివర్సిటీ కూడా చూపలేదంటూ కామెంట్ చేశారు. Even Harvard Business School would not have a better video to communicate the virtues of collaboration & teamwork! pic.twitter.com/ALBRYRCFN0 — anand mahindra (@anandmahindra) April 23, 2022 చదవండి👉🏾ప్రపంచ దిగ్గజంగా టీసీఎస్ ! -
ఐఐటీలో చదివి.. 420 కోట్లు దోచేశాడు!
ఐఐటీలో చదివి, ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లాంటి అగ్రగామి సంస్థ నుంచి పట్టభద్రుడై.. అమెరికాలో మంచి ఉద్యోగంలో చేరిన ఓ వ్యక్తి.. ఆ కంపెనీ నుంచి దాదాపు 420 కోట్ల రూపాయలు కొట్టేశాడట! చాలాకాలం పాటు అదే కంపెనీలో వెంచర్ క్యాపిటలిస్టుగా పనిచేసిన ఇఫ్తికార్ అహ్మద్ ఇప్పుడు భారతదేశంలో దాగున్నాడని అనుమానిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలకు ముందు ఏదో ఒక సమయంలో అమెరికా నుంచి పారిపోయాడని, ఇప్పుడు ఎక్కడున్నదీ తెలియడంలేదని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసీ) వర్గాలు అంటున్నాయి. క్రిమినల్ ఇన్సైడర్ ట్రేడింగుకు పాల్పడిన అహ్మద్, జడ్జి ఉత్తర్వులను ఉల్లంఘించి పారిపోయాడని చెబుతున్నారు. ఓక్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్లో ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న అహ్మద్, తన క్లయింట్లను కోట్లాది డాలర్ల మేర మోసగించినట్లు ఆరోపణలున్నాయి. అతడి స్నేహితుడు అమిత్ కనోడియాతో కలిపి అహ్మద్‌ను ఏప్రిల్ నెలలో అరెస్టు చేశారు. అతడు దొరికి, నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు భారీ జరిమానా కూడా పడే అవకాశం ఉంది.