పుష్కరాలకు కదిలిన బస్సులు | buses for pushkaras | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు కదిలిన బస్సులు

Published Sat, Aug 13 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

పుష్కరాలకు కదిలిన బస్సులు

పుష్కరాలకు కదిలిన బస్సులు

కర్నూలు(రాజ్‌విహార్‌): కృష్ణా పుష్కరాల కోసం రోడ్డు రవాణ సంస్థ బస్సులు శుక్రవారం కదిలాయి. ఉదయం 4 గంటల నుంచే సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు సాయంత్రం 6గంటల వరకు 122 బస్సులు వివిధ ప్రాంతాలకు నడపగా.. 6400 మంది భక్తులు ప్రయాణించారు. ఇందులో ప్రధానంగా శ్రీశైలానికి 66 బస్సులు నడపగా 2వేల మంది, సంగమేశ్వరానికి 65 బస్సుల్లో 2వేల మంది, నెహ్రూనగర్‌కు నాలుగు బస్సుల్లో 60 బస్సులు, బీచుపల్లికి 40 బస్సుల్లో 1500 మంది భక్తులు ప్రయాణించారు. అయితే కొత్త బస్టాండ్‌లో ఏర్పాటు చేస్తున్న పుష్కర నగర్‌ పనులు పూర్తి కాలేదు. శుక్రవారం పుష్కరాలు ప్రారంభం అయినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి: ఆర్‌ఎం
కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ రీజినల్‌ మేనేజరు గిడుగు వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీకి తగ్గట్లు బస్సులు నడిపేందుకు అన్ని విధాలా చర్యలు చేపట్టామని, ఇబ్బందులు ఉంటే సంబంధిత ఇన్‌చార్జీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 
శ్రీశైలం ఇన్‌చార్జీగా డీసీటీఎం మధుసూదన్‌ 91009 98217, కర్నూలు బస్‌స్టేషన్‌కు జోనల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.రజియా సుల్తానా 99592 25753, లింగాలగట్టుకు వర్క్స్‌ మేనేజరు జగదీష్‌ 99592 25749, బీచుపల్లికి డీసీటీఎం శ్రీనివాసులు 99592 25788, సంగమేశ్వరానికి ఈడీ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి 73828 19666, ఆత్మకూరుకు కడప డీసీటీఎం మోహన్‌కుమార్‌ 99592 25768 నియమించామన్నారు. సమస్యల పరిష్కారం కోసం కర్నూలు ఏటీఎం ప్రసాద్‌ 73828 65444, కమర్షియల్‌ ఏటీఎం శ్రీనివాసు 99499 07306, ప్రొద్దుటూరు డీఎం హరి 99592 25777, ఎస్‌ఓ (డీఅండ్‌టీ) మహేశ్వర 90005 03580, సంగమేశ్వరం విచారణ కేంద్రం 73828 70216, బీచుపల్లి విచారణ కేంద్రం 99592 25805, జిల్లా ఓవరాల్‌ ఇన్‌చార్జీ ఆర్‌ఎం వెంకటేశ్వర రావు 99592 25787 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement