పుష్కరాల్లో అధికారుల సేవలు భేష్
Published Wed, Aug 31 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
–డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పుష్కరాల్లో అధికారులు సేవలు బాగున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి కితాబిచ్చారు. అందుకే పుష్కర్లా నిర్వహణలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిందన్నారు. బుధవారం రాత్రి వీజేఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు, మహిళా సంఘాల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఈ మాట్లాడుతూ.. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతమంది అధికారులను ఒకేచోట చూడటం ఇదే మొదటిసారి అన్నారు. ఈ ఖ్యాతి జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్‌కు దక్కుతుందన్నారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ.. మహా సంకల్పం కలిగివుండటం వల్లే దేవుడు కరుణించి కష్ణా నదికి పుష్కలంగా నీరు వచ్చిందన్నారు. పుష్కరాల అనుభూతులు వచ్చే పన్నెండేళ్లు గుర్తుండిపోయేలా ఉన్నాయని ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సర్వేలోనే సంగమేశ్వరం ఘాట్‌కు మొదటిస్థానం దక్కడం సంతోషంగా ఉందని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానం ఈవో నారాయణ భరత్ గుప్త, జేసీ–2 రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడు, ఇరిగేషన్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, విద్యుత్ ఎస్‌ఈ భార్గవరాముడు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement