భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
Published Tue, Aug 9 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
మహానంది: పుష్కరాల సందర్భంగా సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని సంగమేశ్వరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కమలాకర్ తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మహానంది క్షేత్రం నుంచి ప్రసాదాల నిమిత్తం అందించాల్సిన చెక్కు కోసం ఆయన సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సంగమేశ్వరంలో పిండప్రదానాలు, ఇతర పూజాధికాలకు 97 మంది అర్చకులు ఉంటారన్నారు. కపిలేశ్వరం వద్ద వాహనాలను పార్కింగ్ ఉంటుందని, అక్కడి నుంచి ఘాట్ల వరకు 60 సెట్విన్ బస్సులను ఉచితంగా నడుపుతారన్నారు. సంగమేశ్వరంలో రెండు ఫుడ్‌కోర్టులు, ఆత్మకూరులో ఒక ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేస్తున్నారన్నారు. భక్తులకు సేవలందించేందుకు 500 మంది వలంటీర్లు ఉంటారని, దేవాదాయశాఖ నుంచి వివిధ కేడర్లలో ఉన్న 51 మంది సిబ్బంది వస్తారన్నారు. ఆలయం ఆధ్వర్యంలో పది వీల్‌చెయిర్లు అందుబాటులో ఉంచుతామన్నారు.
Advertisement