సా...గుతూనే! | continuee.. | Sakshi
Sakshi News home page

సా...గుతూనే!

Published Sat, Aug 6 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

సా...గుతూనే!

సా...గుతూనే!

– పూర్తికాని పుష్కర పనులు
– ముంచుకొస్తున్న గడువు
– ఘాట్లకు తొలగని విఘ్నాలు
– శ్రీశైలం పురవీధుల్లో దర్శనమిస్తున్న బండరాళ్లు
 
సాక్షి ప్రతినిధి,కర్నూలు: 
– శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ ఎగు వఘాట్‌. ఈ ఘాట్‌లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మెట్ల పనులు సాగుతున్నాయి. ఇరువైపులా ఇంకా రక్షణకు చర్యలు కూడా తీసుకోలేదు.
 
–  సమయం.. శనివారం ఉదయం 8 గంటలు. ఘాటు పనులు పూర్తికాలేదు. రాత్రింబవళ్లు పనిచేయాలని స్వయంగా జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్‌ ఆదేశాలు. అయితే, లింగాలగట్టులోని ఎగువఘాటు వద్ద మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ ఘాటు వద్ద పనిచేస్తూ ఏ ఒక్కరూ కనిపించలేదు.
 
–  పాతాళగంగకు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడిన ప్రాంతం. ఇక్కడ రక్షణ చర్యలను వెంటనే తీసుకోవాలని స్వయంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సూచించింది. అయితే, రక్షణ చర్యల పనులు ఇంకా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ చరియ విరిగిపడుతోందననే ఆందోళనతోనే కింద మాత్రం పనులు కానిచ్చేస్తున్నారు. 
–  సున్నిపెంటలో ఏర్పాటు చేయతలపెట్టిన పుష్కరనగర్‌ ప్రాంతం. ఇక్కడ భూమిచదును పనులు మినహా ఏ ఒక్క పనీ మొదలుకాలేదు.
 
మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాల పుష్కరాల పనులు మాత్రం ఇంకా సాగు..తూనే ఉన్నాయి. 
గడువు మీద గడువు...
వాస్తవానికి పుష్కరాల పనులన్నింటికీ జూలై చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈలోగా పనులు పూర్తిచేయకపోతే చర్యలూ తప్పవని హెచ్చరించారు. అయితే, ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. అయితే పనుల్లో మాత్రం వేగం పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో 5వ తేదీ నాటికి ఘాట్‌ పనులను పూర్తిచేయాలని తాజాగా గడువు విధించారు. అయినప్పటికీ పనుల్లో కొంచెం వేగం పెరిగినప్పటికీ పూర్తికావాల్సిన పనులు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. తాజాగా ఈ గడువు కాస్తా 8వ తేదీకి పెరిగింది. అప్పటికీ పూర్తవుతాయనే నమ్మకం మాత్రం కలగడం లేదు. 
 
సబ్‌కాంట్రాక్టులతోనే సమస్య
పుష్కరాల పనుల్లో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా దోచేసుకుంటున్నారు. అసలు కాంట్రాక్టర్‌ను కాదని... తమ అనుచరులకు సబ్‌ కాంట్రాక్టు పేరుతో పనులు తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారపార్టీకి దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు... అసలు కాంట్రాక్టు సంస్థ నుంచి కొంత మొత్తం పర్సంటేజీ ఇచ్చి పనులు తీసేసుకున్నారు. వాస్తవానికి ఈ పనులను చేసేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కానీ, మనుషులు కానీ లేకపోవడంతోనే వీరందరూ టెండరులో పాల్గొనలేదు. అయినప్పటికీ అధికారపార్టీ ప్రాపకంతో సబ్‌ కాంట్రాక్టు పేరుతో పనులు సంపాదించుకున్నారు. వీరికి అనుభవం లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
శ్రీశైలంలోనూ ఇదే పరిస్థితి...
పుష్కరాలకు ఒకవైపు శ్రీశైలం ముస్తాబవుతోంది. అయితే, గతంలో బహత్తర ప్రణాళిక కింద చేపట్టిన పనులు ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడు హడావుడిగా చేస్తున్న పనులను నిలిపివేశారు. ఇదే విధంగా నీటి సరఫరా వ్యవస్థ కోసం శ్రీశైలం పురవీధుల్లో తవ్విన రోడ్లను తాత్కాలికంగా పూడ్చేశారు. ఇక్కడ ఇప్పటివరకు రోడ్లు వేయలేదు. దీంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా మట్టితో పూడ్చిన తర్వాత మిగిలిన బండరాళ్లు ఎక్కడికక్కడ ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement