ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి
ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయండి
Published Sat, Jul 23 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో చేపట్టిన పుష్కర ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కృష్ణా పుష్కారాల ప్రత్యేక అధికారి అనంతరాం కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టర్ విజయమోహన్‌తో కలసితో ఘాట్ల పనులను పరిశీలించారు. ముందుగా వారు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ప్రత్యేకపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం పాతాళగంగ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 30లోగా పుష్కరఘాట్ల పనులన్ని పూర్తి కావాలని ఆదేశించించిందని, దానికనుగుణంగానే పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి చూస్తే గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉందా అని విలేకరులు అడుగగా, జరుగుతున్న పనులను భద్రతను దష్టిలో ఉంచుకుని వర్క్‌లు చేస్తున్నారని, 20 మీటర్ల చొప్పున రెండు పెద్ద ఘాట్లు తయారవుతాయని, ఈ ఘాట్లు ఆగస్టు 2లోగా పూర్తి చేస్తామన్నారు. అలాగే మిగతా పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు, తదితరులు కూడా ఘాట్ల వద్ద జరుగుతున్న పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అడుగుగా, దీనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ సపరేట్ వింగ్ ఉంటుందని, అధికారులకు కూడా ఈ విషయాన్ని చెప్పానని అన్నారు. క్వాలిటీ కంట్రోల్ నుంచి శ్యాంపిల్స్, టైమ్ టూ టైమ్ టెస్ట్ చేసి వారికే ఇన్చూర్ అయ్యేటట్లు చెబుతామన్నారు. ఘాట్ల పనులో భాగంగా మట్టిని పాతాళగంగలో వేస్తున్నారని కొందరు విలేకరులు చెప్పలగా.. అలా చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన వెంట ఈఓ నారాయణభరత్‌గుప్త, తహసీల్దార్ విజయుడు, దేవస్థానం ఈఈ రామిరెడ్డి, టూరిజం డీవిఎం, ఇరిగేషన్‌శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement