ఆగస్టు ఆరులోగా పనులన్నీ పూర్తి
Published Sun, Jul 31 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
– పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరామ్
శ్రీశైలం:
కష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో చేపట్టిన పనులన్ని ఆగస్టు ఆరో తేదీలోగా పూర్తవుతాయని పుష్కరాల ప్రత్యేక అధికారి అనంతరామ్ తెలిపారు. శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఆయన ఈఓ నారాయణ భరత్ గుప్తతో కలిసి పాతాళగంగ వద్ద జరగుతున్న ఘాట్ల పనులను పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ నూతన ఘాట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఘాట్ల వద్ద జరిగే పనులన్నీ ఆగస్టు 2వ తేదీలోగా పూర్తి అవుతాయని అనుకున్నామన్నా.. అనివార్య పరిస్థితుల కారణంగా ఎర్త్‌వర్క్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యమైందన్నారు. ఆగస్టు ఆరు లోగా అన్ని పనులు పూర్తవుతాయనే ధీమాను వ్యక్తం చేశారు. అలాగే కొండ చరియలు విరిగిన ఘటనపై కమిటీ సూచన మేరకు పనులు చేపట్టామన్నారు. హైటెన్షన్ వైర్‌తో రిటైర్నింగ్ చేసి మెష్ వేయాలని సూచించడంతో ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. పాతఘాట్లు కూడా ఒక వైపు పూర్తయ్యాయని, మెట్ల మార్గంలో ఈఓ నారాయణ భరత్ గుప్తతో కలిసి దిగి చూశామని, మధ్యలో బారికేడింగ్ కూడా పూర్తవుతుందని పేర్కొన్నారు. కొన్ని చోట్ల ప్యాచింగ్ వర్క్ చేయలేదని విలేకరులు అడుగగా, ఇప్పటికే వాటి గురించి సూచించానని, పూర్తవుతాయన్నారు. పుష్కర పనులలో ఎలాంటి రాజీ పడటం లేదని, సీఎం కూడా పనులలో నాణ్యత ఉండాలని ఆదేశించారన్నారు. అనంతరం ఆయన దేవస్థానం పరిధిలో నిర్మిస్తున్న చంద్రావతి కల్యాణమండపం, యజ్ఞవాటిక, హెలిప్యాడ్ ప్రదేశాలను పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్‌డీ రవిప్రకాశ్, డీఎస్పీ రమేష్‌బాబు, ఇరిగేషన్ సీఈ, ఎస్‌ఈ డీఈ,ఈఈ, దేవస్థానం ఈఈ రామిరెడ్డి , ఇంజనీరింగ్ అధికారులు, సీఐవెంకటచక్రవర్తి తదతరులు పాల్గొన్నారు.
Advertisement