శ్రీశైలం రోప్‌వే 12వ తేదీ వరకు బంద్
శ్రీశైలం రోప్‌వే 12వ తేదీ వరకు బంద్
Published Mon, Aug 8 2016 11:38 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో పాతాళాగంగకు వెళ్లే రోప్‌వే మార్గాన్ని ఈ నెల 12వ తేదీ వరకు బంద్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్ వద్ద కొండ చరియలు విరిగిపడిన విషయం విదితమే. భద్రతా చర్యల్లో భాగంగా రోప్‌వే మార్గాన్ని నాలుగు రోజులపాటు మూసివేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మర్మతుల పేరిట రోప్‌వే మార్గాన్ని మూసివేసినట్లు టూరిజం అధికారులు ప్రకటించారు. అయితే 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా వీవీఐపీలకు మాత్రమే రోప్‌వే మార్గం గుండా పాతాళాగంగ వీఐపీ ఘాట్‌కు చేరుకునేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. వద్ధులు, వికలాంగులను.. ప్రత్యేక బస్సుల ద్వారా పాతాళాగంగ వద్దకు తరలించనున్నారు.
Advertisement