పురష్కరాలను విజయవంతంగా నిర్వహిద్దాం
Published Wed, Aug 3 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
– సంగమేశ్వరం ఏరియా, ప్లేస్‌ఆఫీసర్ల సమావేశంలో జేసీ
కర్నూలు(అగ్రికల్చర్):
కృష్ణా పురష్కారాలను సంగమేశ్వరంలో పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించేందుకు ఏరియా, ప్లేస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం తన చాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో సంగమేశ్వరంలో పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంగమేశ్వరంలో మూడు ఘాట్లు ఏర్పాటు చేశామని, వీటికి రోజుకు 10 నుంచి 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏరియా ఆఫీసర్లు, ప్లేసు ఆఫీసర్లు ఈనెల 8 నుంచి సంగమేశ్వరంలోనే ఉండి ఏర్పాట్లపై మరింత పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పుష్కర నగర్, పార్కింగ్ ప్లేసు, ఘాట్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ జవాబుదారి తనంతో విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏజేసీ రామస్వామి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement