jc harikiran
-
హరికిరణ్‌కు ఘన సన్మానం
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను జిల్లా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నేతలు సోమవారం ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్‌లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు టిఎండీ హుసేన్, ఇతర జిల్లా నాయకులు రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కేసీహెచ్ కృష్ణుడు, బలరామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి రఘుబాబు, అరుణమ్మ, దొరస్వామిసాయిరామ్ తదితరులు జేసీకి బొకేలు, శాలువలు, పూలమాలలు, జ్ఞాపికలు సమర్పించి సత్కరించారు. హరికిరణ్ స్పందిస్తూ.. జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు, -
జేసీ బాధ్యతలను తానే ఉంచుకున్న కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): జేసీ బాధ్యతలను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తన దగ్గరే ఉంచుకున్నారు. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయినందున సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. జిల్లా జేసీగా నియమితులైన ప్రసన్న వెంకటేష్ బాధ్యతలు తీసుకోవడంలో మరికొన్ని రోజులు జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్చార్జి బాధ్యతలు ఎవ్వరికి ఇవ్వకుండా తన దగ్గరే కలెక్టర్ ఉంచుకున్నట్లు సమాచారం. -
నేడు బాధ్యతల నుంచి రిలీవ్ కానున్న జేసీ
కర్నూలు(అగ్రికల్చర్): తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. 2015 జనవరి 13న జేసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన దాదాపు 29 నెలలు పనిచేశారు. రిటర్నింగ్ అధికారిగా రెండు సార్లు శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలను నిర్వహించారు. కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించారు. దీర్ఘకాలం పనిచేసిన జేసీగా ఆయన గుర్తింపు పొందారు. బాధ్యతల నుంచి రిలీవ్ అయిన తర్వాత సోమవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నిర్వహించే వీడ్కోలు సభలో పాల్గొంటారు. -
జేసీకి సన్మానం
కర్నూలు(అగ్రికల్చర్): బదిలీపై తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా వెళ్తున్న జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్‌ను శనివారం జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు, జిల్లా పరిషత్ సీఈఓ ఈశ్వర్, డీఎస్ఓ సుబ్రమణ్యం, వికలాంగుల శాఖ ఏడీ భాస్కరరెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రతాప్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు జేసీని ఆయన చాంబరులో కలసి సన్మానించారు. -
ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి
– జిల్లాస్థాయి కమిటీకి జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌లను జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి ఫీజు బులిటీకి అవకాశం ఉందా లేదా అనే దానిపై వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. సోమవారం రాత్రి తన ఛాంబర్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుంగభద్రలో కౌతాళం మండలం గుడికంబాలిలో మూడు, నదిచాగిలో రెండు, హొళగుంద మండలం ముదటమాగిలో రెండు రీచ్‌లను గుర్తించినట్లు తెలిపారు. దేవనకొండ మండలంలోని హంద్రీ, ఇతర వాగులు, వంకల్లో ఏడు రీచ్‌లు గుర్తించామన్నారు. వీటిలో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని పరిశీలించాలన్నారు. ఇందుకు ఇరిగేషన్ ఎస్ఈ, భూగర్భ జలవనరుల శాఖ డీడీ, మైనింగ్ ఏడీ, సంబంధిత ఆర్డీఓలు రీచ్‌లను పరిశీలించి వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హంద్రీ వెంట 36 గ్రామాలు ఉండగా లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక ఉన్న గ్రామాలు 15 ఉన్నాయన్నారు. వీటిలో కూడా ఇసుక తీసేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ రవీందర్రావు, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
చైతన్యం..వినియోగదారుని ఆయుధం
– ప్రతి కొనుగోలుకు విధిగా బిల్లు తీసుకోవాలి –ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలి – జాతీయ వినియోగదారుల దినోత్సవంలో జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు ఎన్నో హక్కులు ఉన్నాయని.. చైతన్యమనే ఆయుధంతో వాటిని సాధించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని శనివారం.. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి మొదలు సాధారణ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని.. వీరికి అనేక హక్కులు ఉన్నాయన్నారు. హక్కులపై సమగ్రమైన అవగాహన కల్పించడమే జాతీయ వినియోగదారుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు విధిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. బిల్లు ఉంటే తీసుకున్న సరుకులు నకిలీవైనా.. తగిన నాణ్యతతో లేకపోయినా వినియోగదారుల ఫోరం కేసువేసి తగిన పరిహారం పొందవచ్చని తెలిపారు. ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ప్రశ్నించేతత్వాన్ని ప్రతి వినియోగదారుడూ అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజిరున్నీసా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శశీదేవీ, జిల్లా వినియోగదారుల సేవ కేంద్రం ఇన్చార్జి నదీమ్ హుసేన్ మాట్లాడారు. కర్నూలులో ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్ విహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో అవగాహన కల్పించారు. ఆకట్టుకున్న నాటికలు వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో.. కేవీఆర్ కాలేజి, శ్రీలక్ష్మీ స్కూల్ విద్యార్థులు నాటికల రూపంలో చూపించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులను జేసీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ మదన్మోహన్శెట్టి, లీగల్ అడ్వైజర్ శివసుదర్శనం, జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, శివమోహన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
7 నుంచి అంతా ఆన్లైన్
–డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ఫైళ్ల నిర్వహణ నవంబర్ 7 వరకు మాత్రమే మాన్యువల్‌గా ఉంటుందని, ఆ తరువాత అంతా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుందని జేసీ హరికిరణ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. ఈ– ఆఫీసులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యలో కొన్ని... – పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న బోజన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు పోన్ ద్వారా జేసీ దృష్టికి తీసుకొచ్చారు. – దేవనకొండ మండలం పొట్లంపాడు గ్రామ సర్పంచ్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. - కోవెలకుంట్లలో ఒకే వ్యక్తికి రెండు పాసుపుస్తకాలు ఉన్నాయని అందులో ఒక దానిని రద్దు చేయాలనే ఒక రైతు ఫిర్యాదు చేశారు. – ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16కు సంబందించిన రుణాలు ఇంకా మంజూరు కాలేదని నందికొట్కూరు చెందిన వ్యక్తి, వితంతు పింఛన్ రావడం లేదని పా ములపాడు మండలం ఇస్కాల గ్రామ మహిళ ఫిర్యాదు చేశారు. -
పురష్కరాలను విజయవంతంగా నిర్వహిద్దాం
– సంగమేశ్వరం ఏరియా, ప్లేస్‌ఆఫీసర్ల సమావేశంలో జేసీ కర్నూలు(అగ్రికల్చర్): కృష్ణా పురష్కారాలను సంగమేశ్వరంలో పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించేందుకు ఏరియా, ప్లేస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో సంగమేశ్వరంలో పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంగమేశ్వరంలో మూడు ఘాట్లు ఏర్పాటు చేశామని, వీటికి రోజుకు 10 నుంచి 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏరియా ఆఫీసర్లు, ప్లేసు ఆఫీసర్లు ఈనెల 8 నుంచి సంగమేశ్వరంలోనే ఉండి ఏర్పాట్లపై మరింత పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పుష్కర నగర్, పార్కింగ్ ప్లేసు, ఘాట్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ జవాబుదారి తనంతో విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఏజేసీ రామస్వామి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కర్నూలు జేసీ హరికిరణ్
కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ)గా చెవ్వూరు హరికిరణ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఈయనను మొదటిసారిగా కర్నూలు జేసీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని పర్లాకిమిడి ఈయన స్వగ్రామం. ఈయన తండ్రి వైద్యుడు, తల్లి లెక్చరర్. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినకు ఈయన 2010-11 వరకు కృష్ణా జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం ఏడాదిపాటు భద్రాచలం సబ్ కలెక్టర్‌గా, 2012-13 చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. 2013 అక్టోబరు 29న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి 14 నెలలపాటు విధులు నిర్వహించారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. కార్పొరేషన్ అప్పుల్లో కూరుకుపోవడంతో ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారనే వాదన ఉంది. కానీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మాత్రం ముందుండేవారన్న పేరుంది. ప్రభుత్వం బదిలీ చేయడంతో సంక్రాంతి పండుగలోపు బాధ్యతలు చేపట్టనున్నట్లు ‘సాక్షి’కి హరికిరణ్ వెల్లడించారు. కన్నబాబు బదిలీ కర్నూలు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. 2012 నవంబరు 30న జేసీగా బాధ్యతలు చేపట్టి రెండేళ్ల పాలనలో తనదైన ముద్ర వేశారు. మైనార్టీ భూముల రక్షణకు చర్యలు చేపట్టారు. ఇసుక, ఖనిజం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో జిల్లా ముందుండేలా కృషి చేశారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుర్తించిన విలువైన భూములకు కంచెలు ఏర్పాటు చేయించి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టారు.