7 నుంచి అంతా ఆన్‌లైన్
Published Mon, Oct 31 2016 11:17 PM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
–డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జేసీ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): ఫైళ్ల నిర్వహణ నవంబర్ 7 వరకు మాత్రమే మాన్యువల్‌గా ఉంటుందని, ఆ తరువాత అంతా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుందని జేసీ హరికిరణ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. ఈ– ఆఫీసులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యలో కొన్ని...
– పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న బోజన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు పోన్ ద్వారా జేసీ దృష్టికి తీసుకొచ్చారు.
– దేవనకొండ మండలం పొట్లంపాడు గ్రామ సర్పంచ్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
- కోవెలకుంట్లలో ఒకే వ్యక్తికి రెండు పాసుపుస్తకాలు ఉన్నాయని అందులో ఒక దానిని రద్దు చేయాలనే ఒక రైతు ఫిర్యాదు చేశారు.
– ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16కు సంబందించిన రుణాలు ఇంకా మంజూరు కాలేదని నందికొట్కూరు చెందిన వ్యక్తి, వితంతు పింఛన్ రావడం లేదని పా ములపాడు మండలం ఇస్కాల గ్రామ మహిళ ఫిర్యాదు చేశారు.
Advertisement