నేడు బాధ్యతల నుంచి రిలీవ్‌ కానున్న జేసీ | today jc released from responsibilities | Sakshi
Sakshi News home page

నేడు బాధ్యతల నుంచి రిలీవ్‌ కానున్న జేసీ

Published Mon, May 8 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

today jc released from responsibilities

కర్నూలు(అగ్రికల్చర్‌): తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీ అయిన జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్‌ కానున్నారు. 2015 జనవరి 13న జేసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన దాదాపు 29 నెలలు  పనిచేశారు. రిటర్నింగ్‌ అధికారిగా రెండు సార్లు శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలను నిర్వహించారు. కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించారు. దీర్ఘకాలం పనిచేసిన జేసీగా ఆయన గుర్తింపు పొందారు. బాధ్యతల నుంచి రిలీవ్‌ అయిన తర్వాత సోమవారం సాయంత్రం జిల్లా రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ నిర్వహించే వీడ్కోలు సభలో పాల్గొంటారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement