కృష్ణా పుష్కరాలకు 665 ప్రత్యేక రైళ్లు
Published Fri, Aug 12 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
నూనెపల్లె: కృష్ణా పుష్కరాలకు భక్తుల రద్దీ దృష్ట్యా 665 ప్రత్యేక రైళ్లు వేశామని సౌత్ సెంట్రల్ రైల్వే సీఓఎం(చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్) మధుసూదన్ రావు తెలిపారు. నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వేలైన్ పరిశీలినకు వచ్చిన ఆయన గురువారం నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భక్తులకు 13 రోజుల పాటు సేవలు కొనసాగిస్తామన్నారు. ప్రత్యేక రైళ్లలో 150 రిజర్వు›్డ రైళ్లు, 490 నాన్ రిజర్వేషన్ రైళ్లు ఉంటాయన్నారు. అన్ని రైళ్లకు 180 పైగా అదనపు భోగీలు వేస్తున్నామన్నారు. కృష్ణా కెనాల్, రాయనపాడు, సిరిపురం, బద్వేల్ మార్గాల్లో రైళ్లు నడుస్తాయన్నారు. రైళ్ల రాకపోకలపై 24 గంటల పర్యవేక్షణ ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రద్దీ దష్ట్యా క్రాసింగ్, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూస్తామన్నారు. భక్తుల భద్రత కోసం ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, మెడికల్ కిట్లు, క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పుష్కర ఘాట్లు, రైలు మార్గాలు తెలుసుకునేందుకు రైల్వేశాఖ ఆధ్వర్యంలో సౌత్‌సెంట్రల్ రైల్వే కృష్ణా పుష్కరాల వెబ్‌సైట్ తెరిచామని.. ఇందులో హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌లో రైళ్ల వివరాలు ఉంటాయన్నారు.
Advertisement