
పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
వజ్రకరూరు : మండలపరిధిలోని రాగులపాడు గ్రామసమీపంలోని హంద్రీనీవా ప్రధాన కాలువలో కృష్ణాజలాలు పరుగులు తీస్తున్నాయి. ఈ నెల10న కర్నూలు జిల్లా మాళ్యాలనుంచి కృష్ణా జలాలు రాగులపాడులిఫ్ట్‌కు చేరుకున్నాయి. అప్పటినుంచి లిఫ్ట్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు పంపుతున్నారు. లిఫ్ట్‌కు నీటి ఉధృతి పెరగడంతో అధికారులు మంగళవారం నాలుగు పంపులద్వారా నీటిపంపింగ్ చేపడుతున్నారు.
ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కులమేర నీరు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. హంద్రీనీవా కాలువలో కృష్ణాజలాలు ప్రవహిస్తుండటంతో పొట్టిపాడు, పీసీ.ప్యాపిలి, రాగులపాడు, కడమలకుంట పరిసర ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.