శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులు
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులు
Published Fri, Aug 19 2016 11:33 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం రోజు రోజుకు తగ్గుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయాల్సి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి వచ్చే ఇన్‌ఫ్లో కూడా తగ్గడంతో డ్యాంలో నీటినిల్వ తగ్గుముఖం పట్టింది. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 157.5068 టీఎంసీల నీరు నిల్వఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్‌కు 25,537 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 14,200 క్యూసెక్కులు హంద్రీనీవా సుజల స్రవంతికి 2,025 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటిమట్టం 873.20 అడుగులకు చేరుకుంది.
Advertisement