పుష్కర సన్నద్ధం | ready for pushkaras | Sakshi
Sakshi News home page

పుష్కర సన్నద్ధం

Published Thu, Aug 11 2016 11:07 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

పుష్కర సన్నద్ధం - Sakshi

పుష్కర సన్నద్ధం

– ముస్తాబైన శ్రీశైల క్షేత్రం
– పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు
– అందుబాటులో పుష్కర నగర్‌లు
– పిండప్రదానానికి ప్రత్యేక స్థలాలు  
 
శ్రీశైలం
కృష్ణా పుష్కరాలకు శ్రీశైల మహాక్షేత్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 5.30గంటలకు పాతాగంగవద్ద  కృష్ణవేణీ మాతకు పూజాధికాలు చేసి సారెను సమర్పిస్తారు. కృష్ణా జలాలతో పాతాళగంగ మెట్లపై భాగాన ఉన్న పాతాళేశ్వరస్వామిని అభిషేకించిన అనంతరం నందిమండపంలో నందీశ్వరుడికి అభిషేకాది అర్చనలను చేస్తారు. ఆ తరువాత క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామికి కృష్ణాజలాలతో అభిషేకించాక స్వామివార్లకు పుష్కర జలాలతో అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.  పుష్కరాల సందర్భంగా శ్రీగిరి కొత్త శోభను సంతరించుకుంది. భక్తుల కోసం జిల్లా అధికార యంత్రాంగం, శ్రీశైలదేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు.
– బస్సుల ద్వారా శ్రీశైలం చేరుకునే యాత్రికులు టోల్‌గేట్‌ వద్ద దిగాల్సి ఉంటుంది. 
– టోల్‌గేట్‌ ద్వారా చేరుకున్న వాహనాలను యజ్ఞవాటిక వైపునకు మళ్లిస్తారు.  
– యజ్ఞవాటిక వద్ద పుష్కరనగర్‌(1)ని  నిర్మించారు. భోజన, లాకర్‌ సౌకర్యాలతో పాటు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ 24గంటలు ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉంటుంది. సుమారు 10వేల చదరపు విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ పుష్కర నగర్‌లో రెండు వేల మంది కూర్చోవచ్చు, వెయ్యి మందికిపైగా విశ్రమించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు.
– యజ్ఞవాటిక ఖాళీ ప్రదేశాన్ని ఆంధ్ర, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సుల పార్కింగ్‌ కేటాయించారు. 
– పుష్కర్‌ నగర్‌ 1 నుంచి రింగ్‌రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించి మల్లమ్మ కన్నీరు వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
– హెలిపాడ్‌ వద్ద సుమారు రూ. 50లక్షల వ్యయంతో నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఫుడ్‌కోర్టు, లాకర్లు, మంచినీరు, క్లాక్‌రూమ్, ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో 10వేల చదరపు విస్తీరణంలో పుష్కరనగర్‌2 నిర్మిస్తున్నారు. 
– పాతాళగంగ రోడ్డులో శివదీక్షా శిబిరాలవ ద్ద తాత్కాలికంగా షామియానాలను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 
– సర్వతోభద్రవనంలో క్షేత్రవ్యాప్తంగా ఉన్న సత్రాల సంఘాలు అన్ని కలిపి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
 – దేవస్థానం వైద్యశాలలో అత్యవసర వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. 30 పడకల అసుపత్రిని కూడా అందులోనే ఏర్పాటు చేశారు. 
– పీజీరోడ్డులో ఉన్న పీహెచ్‌సీ సెంటర్‌ను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు.  
– పాతాళగంగ పుష్కరఘాట్‌ చేరుకోవడానికి ఘాట్‌ రోడ్డు ద్వారా వెళ్లడం ఒక మార్గం. రెండో  మార్గం పాతాగంగ రోడ్డు నుంచి నేరుగా మెట్ల ద్వారా ఘాట్లను చేరుకోవచ్చు. పుష్కర ఘాట్ల సమీపంలో 108 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు.
– భద్రతా కారణాల దష్ట్యా రోప్‌వేను పూర్తిగా నిలిపివేశారు.
–  భ్రమరాంబాఘాట్‌ వద్ద పిండప్రదానానికి ఒకప్రదేశాన్ని, ఒక ప్లాట్‌పాం, ఒక దుస్తులు మార్చుకునే గదిని ఘాట్‌ పై భాగాన ఏర్పాటు చేశారు. దానికి సమీపంలోనే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘాట్‌ వద్ద ఎలాంటి టాయిలెట్స్‌ నిర్మించలేదు. ఈ ఘాట్‌ను వీఐపీలకు మాత్రమే వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
–మల్లికార్జున పుష్కరఘాట్‌ పైభాగంపైన కొద్ది దూరంలో  పిండప్రదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దానికి సమీపంలోనే దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ప్రథమచికిత్స కేంద్రం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఘాట్‌లో స్నానాలు చేసుకున్న భక్తులు పాతాళగంగ పాతమెట్ల మార్గం ద్వారా తిరిగి పై భాగానికి చేరుకుంటారు. 
– పాతాళగంగ వద్ద లైఫ్‌బోట్లు, లైఫ్‌ జాకెట్లు, అగ్నిమాపక  సామగ్రితో ఫైర్‌సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు.
–  స్వచ్ఛంద సేవాకర్తల సేవలను వినియోగించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement