మెట్రో’కు అడ్డుతగలొద్దు
మెట్రో రైలు పనులకు అడ్డు తగిలే భవనాల్ని కూల్చి వేయూలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశిం చింది. ఆ పనులకు అడ్డుతగలొద్దని వ్యాపారులు, భవనాల యజమానుల్ని హెచ్చరించింది. సుప్రీం కోర్టులో వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిం చింది.
నగరంలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు రూ.15 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని,గిండీ మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కిలోమీటర్ల దూరానికి ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండీలను కలుపుతూ సెయింట్ థామస్‌మౌంట్ వరకు 22 కిలోమీటర్ల దూరానికి మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు నిర్ణయించారు.
ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నారుు. కోయంబేడు-విమానాశ్ర యం మధ్య పనులు దాదాపు ముగింపు దశకు చేరాయి. కోయంబేడు - అశోక్ పిల్లర్ వరకు పనులు ముగిశాయి. పట్టాలు సిద్ధం కావడంతో బ్రెజిల్‌లో రూపుదిద్దుకున్న మెట్రో రైలు బోగీలను తీసుకువచ్చి ట్రయల్ రన్‌ను విజ యవంతంగా పూర్తి చేశారు. కోయంబేడు - సెంట్రల్, గిండీ - తిరువొత్తియూరు మధ్యలో కొన్ని చోట్ల భవనాలు, ప్రైవేటు స్థలాలు మెట్రో పనులకు అడ్డంకిగా మారాయి. ఆయా భవనాలు, స్థలాల సమీపంలో పనులు ఆగారుు.
ఏళ్ల తరబడిగా ఉన్న తమ దుకాణాల్ని తొలగించొద్దంటూ వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. మెట్రోకు అండగా హైకోర్టు నిలబడడంతో చివరకు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ పరిశీలించింది. ఈ పిటిషన్‌ను విచారణ నిమిత్తం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. చెన్నై మహా నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న మెట్రో రైలు పనులకు అడ్డు తగల వద్దని స్పష్టం చేసింది. ఈ పనులకు అడ్డంగా ఉన్న భవనాల్ని కూల్చి వేయొచ్చని ఆదేశించింది. భవనాలు, స్థలాల యజమానులకు సకాలం లో నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో ఎక్కడెక్కడ ల్లా పనులు ఆగి ఉన్నాయో, పనులకు అడ్డం గా ఉన్న భవనాల్ని కూల్చి వేయడానికి మెట్రో ప్రాజెక్టు అధికారులు కసరత్తుల్లో ఉన్నారు.