‘రాష్ట్ర బడ్జెట్‌ అన్నిటికంటే భారీ కుంభకోణం’  | Telangana: BJP Senior Leaders Comments On Telangana Budget 2023 | Sakshi
Sakshi News home page

‘రాష్ట్ర బడ్జెట్‌ అన్నిటికంటే భారీ కుంభకోణం’ 

Feb 8 2023 2:37 AM | Updated on Feb 8 2023 8:39 AM

Telangana: BJP Senior Leaders Comments On Telangana Budget 2023 - Sakshi

మాట్లాడుతున్న మాజీ ఎంపీలు  

హిమాయత్‌నగర్‌: రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొదటి కుంభకోణం అయితే.. ధరణి పోర్టల్‌ రెండో కుంభకోణమని బీజేపీ సీనియర్‌ నేతలు ఆరోపించారు. ఈ రెండింటిని మించిన అత్యంత భారీ కుంభకోణం తెలంగాణ బడ్జెట్‌ అని మాజీ ఎంపీలు వివేక్‌వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ భరోసా యాత్రకు సంబంధించిన పోస్టర్‌లను మంగళవారం నారాయణగూడలోని వెంకటేశ్వరకాలనీలో ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు  ప్రతి గ్రామలో కార్నర్‌ మీటింగ్స్‌ నిర్వహిస్తామన్నారు.  వీటిలో తమ పార్టీకి చెందిన 800 మంది ప్రముఖులు హాజరై ప్రసంగించనున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌతమ్‌రావు, రాష్ట్ర నాయకులు గడ్డం రామన్‌గౌడ్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement