సాక్షి, నల్లజర్ల (పశ్చిమగోదావరి): ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ పెరిగిందో తెలియదు. మన ఊరు, భాష కాదు. సుమారు 25 – 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓ గుర్తు తెలియని యువతి దూబచర్ల శివారులో ఉన్న బైపాస్ రహదారి అండర్ పాస్ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. వంటిపై దుస్తులు కూడా సక్రమంగా లేవు. హిందీ, ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడుతోంది. ఉన్నత చదువులు చదివినట్లు కనిపిస్తున్నా మతిస్థిమితం లేదు. ఎవరైనా కొట్టారో, ఎక్కడైనా పడిపోయిందో తెలియదు. కానీ కాళ్లకు దెబ్బలు ఉన్నాయి.
మంగళవారం అటుగా వెళ్తున్న విద్యుత్ లైన్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్, మరో వ్యక్తి ఉండ్రాజవరం వెంకటేశ్వరావు ఆమె స్ధితిని గమనించి దుస్తులు తెచ్చి ఇచ్చారు. కాళ్ల గాయాలకు మందు రాశారు. ఆహారం పెట్టారు. ఆమె వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా, పోలీసుల ద్వారా ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో చేర్చుతామని చెబుతున్నారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు.
చదవండి: (దివ్యాంగ బాలికపై అత్యాచారం)
Comments
Please login to add a commentAdd a comment