hul chul
-
కాకినాడ జిల్లాలో మందుబాబు హల్చల్
-
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
-
దోమకొండలో ముగ్గురు మహిళల హల్చల్
కామారెడ్డి జిల్లా: మండల కేంద్రంలో ముగ్గురు మహిళలు బుధవారం రాత్రి హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన పందిరి కాశీనాథ్ ఇంట్లో చొరబడి బంగారు గొలుసు, డబ్బులు దొంగిలించారంటూ కాలనీవాసులు వారిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్న పీఎస్‌కు తరలించారు. మహిళలు మద్యం తాగి, పెప్పర్‌స్రే, కట్టర్, చాకు, సుత్తి కలిగి ఉన్నారని పేర్కొన్నారు. తమది మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామమని తన పేరు బూస కవిత అని సదరు మహిళ తెలిపారు. దోమకొండకు చెందిన కాశీనాథ్ తమకు గతంలో రూ.5లక్షలు అప్పు ఇచ్చాడని, తన భర్త చనిపోగా ఇల్లు అమ్మి డబ్బులు కట్టానని చెప్పారు. ప్రామిసరీ నోట్లను చించివేసిన కాశీనాథ్ రెండేళ్ల తర్వాత తాము ఇచ్చిన చెక్కులపై చెక్»ౌన్స్ కేసు వేశాడన్నారు. దీంతో తాను అతడిపై వేదింపుల కేసు పెట్టానని పేర్కొన్నారు. రాజీకి వచ్చిన కాశీనాథ్ కేసులు విరమించుకుందామని చెప్పగా, తాను ముందు కేసు విరమించుకున్నానని, కానీ అతడు కేసు విరమించుకోలేదని చెప్పారు. కాగా సదరు మహిళలు చెబుతున్న మాటలు వాస్తవం కాదని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేయాలని కాశీనాథ్ పోలీసులను కోరాడు. పైఅధికారుల సూచన మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. -
ఆపరేషన్ దుర్యోధన సీన్! ఒంటి మీద నూలుపోగు లేకుండా..
పోసాని డైరెక్షన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా ‘ఆపరేషన్ దుర్యోధన’ గుర్తుంది కదా. ఎంత మంది చూశారో తెలియదుగానీ.. అందులో హీరో ఇంట్రో సీనే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సినిమా మీద ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఒంటి మీద నూలు పోగులేకుండా భగవంతుడు(శ్రీకాంత్ క్యారెక్టర్) నగ్నంగా రోడ్ల మీద తిరుగుతుంటుంది. అది చూసి షాక్ తిన్న పోలీసులు.. బ్యానర్ కట్టి పక్కకు తీసుకెళ్తారు. దాదాపుగా ఇలాంటి సీనే ఒకటి రియల్ లైఫ్‌లో జరిగింది. నగ్నంగా రోడ్ల మీద తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఓ పోల్కి ఉన్న బ్యానర్లు కట్టి పక్కకు తీసుకెళ్లారు. తీరా అదుపులోకి తీసుకున్నాక అతనొక రాజకీయ నేత అని, పైగా అధికార పక్షానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కంగుతిన్నారు. పార్టీ దృష్టిలో పడేందుకే తాను అలా సమాధానం ఇవ్వడంతో బిత్తరపోయారు. బీహార్ నలంద జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లాంపూర్ నియోజకవర్గ జేడీయూ యూత్ వింగ్ లీడర్ జయ్ ప్రకాశ్ అలియాస్ కరూ.. నగ్నంగా రోడ్ల మీద హల్ చల్ చేశాడు. సొంత గ్రామం జగదీష్పూర్లో ఫుల్‌గా మద్యం సేవించి.. ఒంటి మీద దుస్తులు విప్పదీసి రోడ్డెక్కాడు. ఆపై అక్కడే ఉన్న ఓ లోకల్ లీడర్ ఇంటికెళ్లి.. అతని కాళ్ల దగ్గర కూర్చున్నాడు. తన గురించి పట్టించుకోవాలని, పార్టీ కోసం గొడ్డులా కష్టపడుతున్నానంటూ బతిమాలుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఏం చేస్తాడో అని భయపడి ఆ లీడర్ గప్‌చుప్‌గా ఉండిపోయాడు. नालंदा- शराब के नशे में जेडीयू नेता ने उतार दिये कपड़े JDU के विधानसभा प्रभारी का नशे में नंगे होने का वीडियो सोशल मीडिया पर वायरल@Jduonline @bihar_police @dmnalanda @RjdNalanda @RJDforIndia @RJD_BiharState @INCBihar @LJP4India @sshaktisinghydv @PremChandraMis2 #Bihar pic.twitter.com/boHq1MoSsm — FirstBiharJharkhand (@firstbiharnews) February 23, 2022 కాసేపటికి కరూ సోదరుడు వచ్చి.. అతన్ని బయటకు లాక్కెళ్లాడు. లిక్కర్ ప్రొబిహిషన్ ఉండడంతో ఇంట్లోనే ఉండాలంటూ బతిమాలుకున్నాడు. కానీ, మాట వినని కరూ.. ‘నన్నెవరూ ఏం పీకలేరంటూ’ తెగ వాగుతూ మళ్లీ రోడ్డెక్కి వీరంగం వేశాడు. ఈ నిరసనతో అయినా పార్టీ తనని గుర్తించాలంటూ కేకలు వేశాడు. అదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో రికార్డు చేశారు. ఆ వీడియో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అప్పటికప్పుడే వైరల్ కావడం.. నిమిషాల వ్యవధిలో పోలీసుల దృష్టికి వెళ్లడం.. ఆపై కరూ కటకటాల వెనక్కి వెళ్లడం బుల్లెట్ స్పీడ్‌తో జరిగిపోయాయి. లిక్కర్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అతన్నిఅరెస్ట్ చేసినట్లు ఇస్లాంపూర్ పోలీసులు వెల్లడించారు. కరూ కోరుకున్నట్లే అధిష్టానం దృష్టిలో పడ్డాడు. కానీ, ఫలితం మరోలా ఉంది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఇస్లాంపూర్ జేడీయూ బ్లాక్ ప్రెసిడెంట్ తన్వీర్ అలం ప్రకటించాడు. -
తాగిన మత్తులో కత్తితో రోడ్డుపై యువకుడి వీరంగం
-
తూర్పు గోదావరి జిల్లాలో చైన్ స్నాచర్ల హల్ చల్
-
చెట్టెక్కి.. చెమటలు పట్టించి..
బుట్టాయగూడెం: మతిస్థిమితంలేని బాలుడు మర్రిచెట్టు చిటారు కొమ్మకు చేరుకుని కిందకు దూకేస్తానంటూ ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన మండలంలోని చీమలవారిగూడెంలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తాడు సాయంతో బాలుడిని చెట్టు నుంచి కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.దుర్గారావు, రమణ రెండో కుమారుడు రోహిత్ (12) ఐదు నెలలుగా మతిస్థిమితం కోల్పో యి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 7 గంటలకు వారి ఇంటి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు ఎక్కి చిటారు కొమ్మన కూర్చున్నాడు. దింపే ప్రయత్నం చేయగా దూకేస్తానని బెదిరించడంతో కుటుంబసభ్యులు పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఇక్కడకు చేరుకుని ఉప్పరిల్లకు చెందిన కొండరెడ్డి గిరిజనుడి సాయంతో తాడు కట్టి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడిని సురక్షితంగా కిందకు దించారు. రోహిత్ ఆరో తరగతి చదువుతున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు. -
పెట్రోల్ బాటిళ్లు నడుముకు కట్టుకుని...
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్ వసంత్‌కుమార్ మంగళవారం నడుముకు పెట్రోల్ బ్యాటిళ్లు, చేతిలో లైటర్‌తో హల్చల్ చేశారు. సుమారు గంటన్నర పాటు పోలీసులు, వైద్య సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట ఠాణాకు తరలించారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలగూడ పోలీసులకు నగర కొత్వాలు రూ.10,000 నజరానా ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ వసంత్‌కుమార్ క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ)గా విధులు నిర్వహిస్తూ, టీజీజీడీఏ గాంధీ యూనిట్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కరోనా అనుమానితులకు అందించాల్సిన సేవలపై గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో ఈ నెల 7న ఆస్పత్రి పాలనాయంత్రాంగం సమావేశమైంది. అక్కడకు వచ్చిన వసంత్‌కుమార్ పారిశుధ్య నిర్వహణ, నర్సింగ్ సిబ్బంది కొరతపై మాట్లాడుతూ.. ఆర్ఎంఓ జయకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరినా వినిపించుకోకుండా పాలనాయంత్రాంగం పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పాలనాయంత్రాంగం వైద్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వసంత్‌కుమార్‌ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (డీఎంహెచ్)కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెట్రోల్ బాటిళ్లు కట్టుకుని ఈ క్రమంలో వసంత్‌కుమార్ మంగళవారం మధ్యాహ్నం 12.05 గంటలకు మూడు లీటర్ల పెట్రోల్‌ను బాటిళ్లలో నింపి నడుముకు కట్టుకుని, చేతిలో లైటర్ పట్టుకుని గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం వద్దకు చేరుకున్నారు. తనను అన్యాయంగా సరెండర్ చేశారని, గాంధీ ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారని ఆరోపించారు. పోలీసులు, వైద్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దగ్గరకు వస్తే నిప్పంటించుకుంటానని బెదిరించడంతో దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. సుమారు గంటన్నరపాటు హైడ్రామా కొనసాగింది. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన పోలీసులు వ్యూహం సిద్ధం చేశారు. వసంత్‌కుమార్‌తో మీడియా ప్రతినిధులు మాట్లాడుతుండగా సీఐ బాలగంగిరెడ్డి ఒక్క ఉదుటన అతన్ని సమీపించి చేతిని వెనకకు విరిచి పట్టుకుని లైటర్‌ను గుంజుకోగా, మిగిలిన సిబ్బంది క్షణాల్లో ఆయన నడుముకున్న బాటిళ్లను తీసేశారు. అనంతరం బేగంపేట ఠాణాకు తరలించారు. ఈ ఘటనను జనరల్ డైరీ (జీడీ)లో పొందుపర్చామని, న్యాయనిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చిలకలగూడ సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి వైద్యుని ప్రాణాలు కాపాడినందుకు నగర కొత్వాల్ అంజనీకుమార్.. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, పోలీస్ సిబ్బందికి రూ.10 వేల నజరానా ప్రకటించారు. కన్నీటిపర్యంతమైన జ్యోతిర్మయి.... వసంతకుమార్ భార్య జ్యోతిర్మయి గాంధీ గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. నిండు గర్భిణి అయిన ఆమె ఆస్పత్రిలో జరిగిన ఘటనను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, వసంత్ కుమార్ ఆస్పత్రి ప్రాంగణంలో చేసిన చర్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్ ఖండించారు. వసంత్‌కు అన్యాయం జరిగితే ఉన్నతాధికారులతో సమావేశమై చర్చిస్తామన్నారు. ప్రజారోగ్య విభాగానికి... గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్వహించిన సమీక్షలో ఆర్‌ఎంవోను దుర్భాషలాడిన విషయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డాక్టర్ వసంత్‌ను ప్రజారోగ్య సంచాలకుడికి అప్పగించామని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తూ వసంత్‌కుమార్ ఆస్పత్రిలో ఫార్మసీ కుంభకోణం జరిగిందని డీఎంఈ రమేశ్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రమేశ్‌రెడ్డి స్పందించారు. కొద్దికాలంగా వసంత్ ప్రవర్తన బాగోలేదని, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. ఆర్‌ఎంవోను దుర్భాషలాడిన విషయంపై మాత్రమే వసంత్‌ను సరెండర్ చేశామని స్పష్టం చేశారు. అవకతవకలపై ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదని వసంత్‌ను ప్రశ్నించారు. నడుముకు పెట్రోల్ బాటిళ్లతో వసంత్ కుమార్. (ఇన్సెట్లో) లైటర్ -
బుసలు కొడుతూ నాగుపాము..
పెందుర్తి: చినముషిడివాడ పాతూరులో ఆరు అడుగుల నాగుపాము ఆదివారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ పాత ఇంటిని కూలగొట్టేందుకు జేసీబీతో యజ మాని పనిచేస్తున్నాడు. ఆ సమయంలో బుసలు కొడుతూ నాగుపాము బయటకు రావడంతో అందరూ పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి పామును చాకచక్యంగా పట్టుకుని దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. -
అప్పుడు వువుజెలా.. ఇప్పుడు డయాబొలికా..
రియో డి జనీరో: వువుజెలా.. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన గత ప్రపంచకప్‌లో ఈ బూరలు చేసిన హల్చల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మళ్లీ బ్రెజిల్లో అభిమానులకు సాకర్తోపాటు అటువంటి వినోదమే అందబోతోంది. వువుజెలాల స్థానంలో ‘డయాబొలికా’లతో స్టేడియాల్లో అభిమానులు సందడి చేయబోతున్నారు. బెల్జియంలో తయారైన డయాబొలికాకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. బ్రెజిల్లో అభిమానులు ఎగబడి మరీ వీటిని కొంటున్నారట. ఇప్పటికే లక్షల్లో డయాబొలికాలను అమ్మినట్లు తయారీదారులు చెబుతున్నారు. ఫిఫా ప్రపంచకప్ మొదలయ్యే సమయానికి వీటి అమ్మకాలు మరింతగా జరుగుతాయంటున్నారు. ఇక వువుజెలాలతో పోలిస్తే వీటి సైజు చాలా చిన్నదిగా ఉంటుంది. స్టేడియంలోకి వీటిని సులువుగా తీసుకెళ్లవచ్చు. వువుజెలాల మాదిరిగా వీటి నుంచి పెద్ద శబ్దం రాదని, అలాగే చికాకు తెప్పించని చెబుతున్నారు. అంతేకాదు వీటి శబ్దం కూడా వినసొంపుగా ఉంటుందంటున్నారు. 2010 ప్రపంచకప్‌లో మ్యాచ్ జరిగిన ప్రతీచోట అభిమానులు వువుజెలాలతో సందడి చేశారు. వీటి కారణంగా నిర్వాహకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఆటగాళ్లయితే వువుజెలాలతో తాము ఏకాగ్రతను కోల్పోతున్నామంటూ ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఫిఫా ప్రతినిధులు వీటిపై నిషేధం విధించలేకపోయారు. కారణం దక్షిణాఫ్రికాలో వువుజెలా అక్కడి సంప్రదాయంలో భాగమైపోయింది. డయాబొలికాలనుంచి వెలువడే శబ్ధం అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నా... ఆటగాళ్లు, నిర్వాహకులు ఏవిధంగా స్పందిస్తారో మరికొద్ది రోజ్లుల్లోనే తేలిపోనుంది.