![Snake Hul Chul In Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/18/6555.jpg.webp?itok=7cwPc8HO)
పెందుర్తి: చినముషిడివాడ పాతూరులో ఆరు అడుగుల నాగుపాము ఆదివారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ పాత ఇంటిని కూలగొట్టేందుకు జేసీబీతో యజ మాని పనిచేస్తున్నాడు. ఆ సమయంలో బుసలు కొడుతూ నాగుపాము బయటకు రావడంతో అందరూ పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి పామును చాకచక్యంగా పట్టుకుని దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment