భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. చనిపోయిన వాళ్లు గురించి తలుచుకుని కొందరు బాధపడుతుంటారు. మరొకొందరు వారి గుర్తుగా దానధర్మాలు వంటివి చేస్తుంటారు. ఏదేమైన మనకిష్టమైన వాళ్లని పోగొట్టుకుంటే అది బాధ అని చెప్పడం కంటే నరకమనే చెప్పాలి. అందుకే దీని నుంచి కాస్తైన ఉపశమనం పొందేందుకు ఇండోనేసియా ప్రజలు ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు.
సాధారణంగా ఎవరైన చనిపోతే.. వాళ్లుని శాస్త్ర ప్రకారం దహనం చేసి అంత్యక్రియలను పూర్తి చేస్తారు. కానీ ఇండోనేసియాలో చనిపోయిన పిల్లలను చెట్ల వేరు కింద పాతిపెడతారంట. వినడానికి వింతగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారట. ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తానా తరోజాలో గ్రామంలో ఎవరి ఇంట్లో అయినా చిన్న పిల్లలు చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించరు. దహన సంస్కారాలు చేపట్టరు.
ఎందుకంటే పిల్లలు చనిపోతే.. ఆ తల్లిదండ్రులకు ఎంతగానో బాధను మిగిలుస్తుంది. అది వర్ణనాతీతమనే చెప్పాలి. అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ చిన్నారుల మృతదేహాల్ని చెట్టు కింద మొదలు వేరు బాగంలో పాతిపెడతారు. చనిపోయిన పిల్లవాడు క్రమంగా ఈ చెట్టులోనే భాగమైపోతాడు. ఇలా చేయడం వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టిన చిన్న పిల్లవాడు చెట్టు రూపంలో శాశ్వతంగా జీవిస్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యులు భావిస్తారు. ఇది ఇక్కడి విచిత్రమైన సంప్రదాయం. అయితే పెద్దలు చనిపోయినప్పుడు సాధారణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
చదవండి దుబాయ్‌లో భారత ఆర్కిటెక్ట్ జాక్‌పాట్.. 25 ఏళ్లపాటు, నెలకు రూ.5.59 లక్షలు..
Comments
Please login to add a commentAdd a comment