కుప్పి గంతులు.. కోతి గంతులు.. ఆఖరుకు పిచ్చి గంతుల గురించి కూడా విని ఉంటారు. కానీ, చెట్ల గంతుల గురించి తెలుసా? సంతోషం వస్తే మనిషి గంతులేసి డాన్స్ చేసినట్లు.. డాన్స్ చేసే చెట్లు కూడా ఉన్నాయి. అది కూడా అలాంటి ఇలాంటి డాన్స్ కాదు సాల్సా డాన్స్. ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో ఈ ‘డాన్సింగ్ ట్రీస్’ మీకు దర్శనమిస్తాయి.
ప్రశాంతమైన సముద్రతీరంలో.. తెల్లని ఇసుక మధ్యలో నిల్చుని సాల్సా డాన్స్ చేస్తాయి. నిజానికి ఇవి సాధారణ చెట్లలాగే నిశ్చలంగా ఉంటాయి. కానీ, మనిషిలాగా రెండు కాళ్లు, రెండు చేతులు ఉన్నట్లు పొట్టిగా రెండు లేదా మూడు కొమ్మలు, చిన్న చిన్న ఆకులతో కనిపించే వీటి విభిన్న ఆకృతి, డాన్స్ చేస్తుంటే మధ్యలో ఆగిన మనిషి భంగిమలా భ్రమింప జేస్తాయి. అప్పుడప్పుడు అలల తాకిడికి స్థానభ్రంశం కూడా చెందుతాయి.
వీటి కారణంగానే ఈ చెట్లు సాల్సా డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ఎవరో ఫేమస్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసినట్లు.. ఓ క్రమ పద్ధతిలో ఉండి, చక్కటి డాన్స్ పోజ్‌లో నిల్చుంటాయి. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో వీటి అందాలను చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ప్రస్తుతం ఈ డాన్సింగ్ ట్రీస్‌ను చూడ్డానికి పర్యాటకులు, ఆ అందాలను ఫొటోల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు క్యూ కడుతున్నారు. మీరు కూడా చూడాలనుకుంటే ఇండోనేషియా బయలుదేరండి.
చదవండి: అందమైన విలన్.. నెగెటివ్ రోల్ దక్కడం ఓ వరం: కీర్తి చౌదరి
Comments
Please login to add a commentAdd a comment