ఇటీవల కాలంలో కొన్ని అనూహ్య ప్రమాదాల్లో చాలా మంది వెట్రుక వాసిలో తప్పించుకుంటున్న ఉదంతాలను చాలా చూశాం. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తికి ఉన్న చెడ్డ అలవాటే అతని ప్రాణాన్ని కాపాడింది.
(చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!)
అసలు విషయంలోకెళ్లితే... అర్వెన్ తుఫాను యూకేలోని అనేక ప్రాంతాలను వర్షం ముంచెత్తడంతో ముగ్గురు వ్యక్తుల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ తుపాన్ వస్తున్న సమయంలో బ్రిడ్జెండ్‌లోని ఒక పబ్ మేనేజర్ చెరిల్ పౌండ్ అనే 55 ఏళ్ల మహిళ పబ్‌ని మూసి వేసేద్దామనకుని అక్కడ ఉన్న టేబుల్స్ అన్నింటిని శుభ్రం చేస్తూ ఉంది. అయితే కాసేపు విరామం తీసుకుని సిగరెట్ కాల్చుకున్నాక మిగతా టేబుల్స్‌ని శుభ్రం చేద్దామనుకుంది.
దీంతో ఆమె ఆ పబ్‌లో ఉన్న టేబుల్స్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి సిగరెట్ కాల్చుకుంటుంది. అంతే ఒక్కసారిగా అక్కడ ఉన్న టేబుల్స్ అన్నింటిపై ఒక పెద్ద వృక్షం పడింది. ఆమె గనుక విరామం తీసుకోకుండా అక్కడ క్లీన్ చేస్తూ ఉండి ఉంటే ఆమె చనిపోయి ఉండేది. అంతేకాదు ఆ చెట్టు ఆమెకు అంగుళం దూరంలోనే పడటం గమనార్హం.
(చదవండి: ఐఏఎస్ ఆఫీసర్‌నంటూ.... బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌కి టోకరా)
Comments
Please login to add a commentAdd a comment