చెట్టును ఢీకొట్టిన ఆటో.. | Auto crushed in collision with tree in jagtial | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన ఆటో..

Published Mon, Apr 17 2017 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

Auto crushed in collision with tree in jagtial

జగిత్యాల: వేగంగా వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహానాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల మండలంలోని కల్లెడ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నిజామాబాద్‌ జిల్లా నడికుడికి చెందిన ఓ కుటుంబ సభ్యులు ధర్మపురి గోదావరిలో పుణ్యస్నానాలు చేసి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement