
ఇక్కడ చిరుతపులి గజగజమంటోంది మనలా చలికి కాదండోయ్.. తనని తరుముకొచ్చిన గజరాజుని చూసి భయపడి.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు కదా. అయితే ఆ గొప్పోళ్ల జాబితాలో ఈ చిరుత ఉన్నట్లు లేదు..
అందుకే.. వేట కోసం బయలుదేరి.. తీరా వెళ్లకవెళ్లక ఏనుగుల గుంపు జోలికి పోయింది. దాని దురదృష్టానికి తగ్గట్లు ఆ వెళ్లిన గ్రూపులో ఇలాంటి తిక్క ఏనుగు కూడా ఉంది. అది ఊరుకుంటుందా.. వార్నింగ్ ఇవ్వడంతో సరిపెట్టకుండా.. ఉరుకులెత్తించింది.
చదవండి: కోడి, గుర్రపు పందేలు తెలుసు కానీ.. పందుల పోటీలు గురించి విన్నారా
ఏనుగులకు చెట్లెక్కడం రాదు కాబట్టి ఇదిగో ఇలా బతికి బట్టకట్టింది. లేకుంటే.. బతుకు బస్టాండు అయిపోయేది. దక్షిణాఫ్రికాలోని నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో ఉన్న రిజర్వు పార్కులో చోటుచేసుకున్న ఈ సన్నివేశాన్ని ఫొటోగ్రాఫర్ కెవిన్ డూలే క్లిక్‌మనిపించారు. చెట్టెక్కింది కదా అని ఈ ఏనుగు చిరుతను అంత ఈజీగా వదిలేయలేదట. దాదాపు గంటపాటు అక్కడే ఉండి.. రకరకాల విన్యాసాలతో చిరుతకు చుక్కలు చూపించిందట.
–సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment