
విజయలక్ష్మీ (ఫైల్)
యశవంతపుర(కర్ణాటక): చిరుత దాడిలో తప్పించుకుని చెట్టు ఎక్కిన యువతి జారి కింద పడి గాయపడిన ఘటన రామనగర జిల్లా మాగడి తాలూకా మరళుదేవనపురలో జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన విజయలక్ష్మీ బుధవారం గొర్రెలు మేపుతుండగా గొర్రెలపై చిరుత దాడి చేసింది.
భయంతో విజయలక్ష్మీ చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకుంది. చిరుత వెళ్లి పోయిన తరువాత చెట్టు దిగే క్రమంలో జారికిందపడింది. దీంతో ఆమెకు నడుం విరిగింది. బాధితురాలిని కుటుంబసభ్యులు మాగడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు..
Comments
Please login to add a commentAdd a comment