
మంచిర్యాల: వేమనపల్లి మండంలోని నాగారం గ్రామంలో మంగళవారం ఉదయం భారీ వర్షానికి నూరేళ్ల కాలం నాటి చింత చెట్టు నేలకులింది. వేమనపల్లి–బెల్లంపల్లి మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో నియోజకవర్గం కేంద్రానికి, కాగజ్‌నగర్ వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. త్రీఫేజ్ విద్యుత్ లైన్ తెగిపోవడంతో పంట పొలాలు, గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది.
ఎంపీవో బాపురావు సూచన మేరకు స్థానిక సర్పంచ్ గ్రామస్తులతో చెట్టు తొలగించే ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి నుంచి కటింగ్ మిషన్ తెప్పించి అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించారు. ట్రాన్స్‌కో ఏఈ దీక్షిత్‌తో మాట్లాడి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించి సరఫరా చేపట్టారు. సాయంత్రం వరకు రాకపోకలు ప్రారంభమయ్యాయి.