చర్యకు ప్రతి చర్య అనేది సహజం. మనిషి చేసే ప్రతి పనికి ఫలితం అనుభవంచి తీరాల్సిందే అని పెద్దలు వూరికే అనలేదు. ఇక మనుషుల రకరకాలుగా ఉన్నట్లే.. వారి మనస్తత్వం కూడా అనేక విధాలుగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి చెట్టును తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వీడియోలోని వ్యక్తి తన బలాన్ని చూపించుకోవాలనుకున్నాడేమో.. అదే పనిగా మొద్దుబారిన ఓ చెట్టును తన్నడం మొదలు పెట్టాడు. బలంగా తన్నుతున్నాడు గానీ.. బుద్దికి పని చెప్పినట్టు లేడు. ఇంకేముంది చెట్టు విరిగింది. కానీ మొద్దు వచ్చి తలపై పడింది. అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఈ వీడియోను భారతీయ అటవీ అధికారి సుధా రామెన్ ‘‘మీరు చేసేది.. మీకు తిరిగి వస్తుంది. అది మంచైనా.. చెడైనా’’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. 91 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వందల మంది కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘కర్మ ఫలం అంటే ఇదే.. మనం ఏ చేస్తామో.. అది తిరిగి వస్తుంది.’’ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ గొప్పకు పోయాడు.. చివరకు పాఠం నేర్చుకున్నాడు.’’ అని రాసుకొచ్చారు. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలిరాలేదు. కానీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
All that you do comes back to you - Good and Bad pic.twitter.com/kMHZGF3NLi
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) July 1, 2021
చదవండి:
97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు
పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు
Comments
Please login to add a commentAdd a comment