ఇంతవరకు ఎన్నో పురాతనమైన చెట్ల గురించి విన్నాం. మహా అయితే రెండొందలు లేదా నూటయాభై ఏళ్లు అంతే. కానీ ఏకంగా 800 ఏళ్ల నాటి చెట్ల గురించి విని ఉండం. పైగా అన్నేళ్ల పాటు సజీవంగా చెట్లు ఉన్న దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడూ ఈ చెట్టు అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందేమో!. ప్రస్తుతం ఈ చెట్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ చెట్టు ఎక్కడ ఉంది? ఏంటా విశేషాలంటే..
ఆ పురాతనమైన చెట్టు దక్షిణ కొరియాలో ఉంది. పరిశోధకులు దీన్ని 800 ఏళ్ల నాటి వృక్షంగా చెబుతారు. ఇది దక్షిణ కొరియా జాతీయ స్మారకంగా చిహ్నంగా పిలుస్తారు. అంతేగాదు అత్యధికంగా పర్యాటకులు సందర్శించే చెట్టుగా కూడా చెబుతుంటారు. ఈ చెట్టు సుమారు 17 మీటరల చుట్టుకొలతను కలిగి విశాలమైన కొమ్మలతో పరుచుకుని ఉంది. ఈ చెట్టు బంగారు రంగులో మెరుస్తూ ఓ దేవతా వృక్షం మాదిరిగా కనిపిస్తుంది. అందువల్ల నెటిజన్లు ఈ చెట్టుకి "ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టు"గా కితాబిచ్చారు. ఇది క్రీస్తూ పూర్వం సిల్లా రాజవంశ కాలంలోనే మొలకెత్తిందని చరిత్రకారులు చెబుతున్నారు.
మరికొంతమంది పురాణాల ప్రకారం సిల్లా చివరి రాజు సన్యాసిగా మారేందుకు కుమ్‌గాంగ్ పర్వాతానికి వెళ్తుండగా.. తన గుర్తుగా ఈ చెట్టుని నాటాడని కథలుకథలుగా చెబుతుంటారు అక్కడి ప్రజలు. ఐతే అందుకు సరైనా ఆధారాలు లేవు. కానీ పరిశోధకులు ఈ చెట్టు వయసుని వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా పేర్కొన్నారు. ఈ చెట్టును జోసోన్ రాజవంశ కాలంలోనే అప్పటి ప్రభుత్వం దీన్ని గుర్తించి సమున్నత స్థానం కల్పించిందని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.
ఈ చెట్టుని జింకో చెట్టుగా పిలుస్తారు దక్షిణ కొరియా వాసులు. శాస్త్రవేత్తలకు ఈ చెట్టు పెరుగుదల అంతు చిక్కని మిస్టరీలా ఉంది. దీనిపై ఇప్పటికీ పలు పరిశోధలనలు చేస్తూనే ఉన్నారు. ఆ పరిశోధనలో..జింకో అనేది తూర్పు ఆసియాకు చెందిన జిమ్నోస్పెర్మ్ చెట్టు జాతి చెందినదిగా గుర్తించారు. పైగా ఇది 290 మిలియన్ సంవత్సరాల క్రితం మొదటిసారిగా కనిపించిన చివరి జీవజాతి అని చెప్పుకొచ్చారు పరిశోధకులు.
This ginkgo tree, in the village of Bangye-ri in South Korea,
— Science girl (@gunsnrosesgirl3) December 4, 2023
is thought to be at least 800 years old
pic.twitter.com/0NxlFQ0USd
(చదవండి: ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా? డైనోసర్‌ని చూసొండొచ్చా?)
Comments
Please login to add a commentAdd a comment