ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరూ.. ఒక్కో రకంగా తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తమ చేష్టలతో తోటి వారికి ప్రేరణగా నిలవాలని భావిస్తారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది. ఇందులో ఒక వ్యక్తి చేసిన పని చూసినవారంతా వాహ్.. అంటున్నారు. మరి అదేంటో మీరూ చూసేయండి...
ఇన్‌స్టాలో షేర్ అయిన వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం వెనుకాల సీట్లో కుండీలో పెరుగుతున్న మామిడి మొక్క (చెట్టు)ను భద్రంగా కట్టి తీసుకెళ్తున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేశాడా? నిరంతర ప్రయాణంలో కూలర్లను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లలేం గనుక ఇలా తీసుకెళ్లాడా? లేక నర్సరీనుంచి మొక్కను కొనుగోలు చేసి తీసుకెళుతున్నాడా? పెద్దగా పెరిగిన మామిడి చెట్టును ఒకచోటు నుంచి మరో చోటుకి షిఫ్ట్ చేస్తున్నాడా అనేది స్పష్టత లేదు. కానీ కొంతమంది అద్భుతమైన ఐడియా అంటూ కమెంట్ చేశారు. ఇది కావాలనే చేసిన జిమ్మిక్కు అని మరికొంతమంది వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా గ్రోబ్యాగ్‌లో భారీగా పెరిగిన మామిడి చెట్టును బండిపై తీసుకెళ్లడం వింతగా అనిపిస్తోంది. అంతేకాదు దీనికి మామిడి కాయలు కూడా కనబడుతుండటం విశేషం. వేగానికి చెట్టు కొమ్మలు హాయిగా ఊగుతోంటే.. అంతకంటే గమ్మత్తుగా ఆ మామిడికాయలు నాట్యం చేస్తున్నాయి. ఈ విన్యాసం చూడడానికి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ వీడియో లక్షకు పైగా లైక్‌లను పొందింది. ప్రస్తుతం ఈ వీడియో 'సేతుమాధవన్ థంపి' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెగ వైరల్ అవుతోంది.
ఇవి చదవండి: మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
Comments
Please login to add a commentAdd a comment