
యాచారం: ప్రతి వ్యక్తీ ప్రతి యేటా ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు కోరారు. ఆరో విడత హరితహారంలో భాగంగా గురువారం యాచారం మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా హరితహారం నిర్వహించడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటి సంరక్షణ చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, యాచారం సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గొల్లపల్లి లలిత, ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.
మొక్క నాటి నీళ్లు పోస్తున్న క్రికెటర్ అంబటి రాయుడు