Haritha haaram
-
Telangana: మళ్లీ వచ్చేది మేమే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరలో పూర్తిచేసి.. నాలుగైదు మాసాల్లోనే రిజర్వాయర్లను నీటితో నింపుతామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలకు కాళేశ్వరం జలాలను తరలిస్తామని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు అర్బన్ఫారెస్ట్లో సీఎం కేసీఆర్ హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కాళేశ్వరంతోపాటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా పూర్తి కావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ వాళ్లు అడ్డు తగిలి కోర్టుల్లో కేసులు వేసి పనులు ఆగేలా చేశారు. ఎన్నో అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పనులు కొనసాగించి ఇప్పటికే 85 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. నాలుగైదు మాసాల్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్లను నీటితో నింపుతాం. కాళేశ్వరం జలాలపై ఎలాంటి వివాదాలూ లేవు. కృష్ణా జలాలపై వివాదం కొనసాగుతోంది. రంగారెడ్డిని సస్యశ్యామలం చేస్తాం.. రంగారెడ్డి జిల్లా దాసర్లపల్లిలో నాకుగతంలో పదిపదిహేను ఎకరాలు ఉండేది. 20 బోర్లు వేయాల్సి వచ్చింది. సన్నగా పోసే బోర్లతో అనేక కష్టాలు పడ్డాం. ఆ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం తెలంగాణలో ఈ బాధలన్నీ తీరిపోయాయి. ఓ చిన్న లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని వికారాబాద్, పరిగి సహా చేవెళ్ల, మహేశ్వరం, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం. కొండపోచమ్మ కింది నుంచి ఘట్కేసర్ మీదుగా కాళేశ్వరం నీళ్లను మూసి దాటించి లోయపల్లి రిజర్వాయర్‌ను నింపడం ద్వారా రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. వారి నోళ్లు మూతపడ్డాయి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు చాలా మంది హేళన చేశారు. తెలంగాణ వారికి పంటలు పండించడం రాదన్నారు. కరెంట్ లేక చీకట్లో మగ్గుతామన్నారు. ప్రస్తుతం దేశంలోనే ధాన్యం దిగుబడిలో, తలసారి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. మొక్కలను నాటి చెట్లను పెంచడంలో ముందుంది. 100 శాతం ఓడీఎఫ్ సాధించడంలోనూ ముందున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలోనూ టాప్‌లో నిలిచింది. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయి నేను హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్లు హేళన చేశారు. మొక్కలు నాటే కార్యక్రమంపై జోకులు వేసి నవ్వుకున్నారు. కానీ హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్లకు కడుతున్నాయి. రాష్ట్రంలో 22 శాతం ఉన్న పచ్చదనం 30శాతం దాటింది. పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఇప్పటికే 267 కోట్ల మొక్కలు నాటాం. ఇప్పటికే 170 అర్బన్ ఫారెస్ట్‌లను పూర్తి చేసుకున్నాం. ఇది మనందరి విజయం. హరితహారంలో భాగంగా ఈ ఏడాది పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఇందుకు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందిగా ముఖ్య కార్యదర్శికి సూచించాం. హరితహారం చట్టం తెచ్చినప్పుడు సర్పంచులు నాపై కోపం తెచ్చుకున్నారు. అయినా కష్టపడి పనిచేశారు. ఫలితంగా మోడువారిన దారులన్నీ నేడు పూల తేరులయ్యాయి. గ్రామాలు పచ్చబడిన కీర్తి సర్పంచులకే దక్కుతుంది. ఫారెస్ట్ అధికారుల కోసం 20 పోలీస్ స్టేషన్లు అటవీ రక్షణలో భాగంగా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎఫ్ఆర్ఓ బండి శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం ఇస్తున్నాం. మనిషినైతే తేలేం కానీ కొన్ని డబ్బులు ఇచ్చాం. 500 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చి ఆదుకున్నాం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫారెస్ట్ ఆఫీసర్లకు సాయుధ సాయం అందజేయాలని నిర్ణయించాం. అటవీ అధికారుల భద్రత కోసం తెలంగాణవ్యాప్తంగా 20 పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అటవీ ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. నాలుగు మున్సిపాలిటీలకు రూ.150 కోట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. జల్పల్లి, తుక్కుగూడ, మీర్పేట్, బడంగ్పేట్ మున్సిపాలిటీలకు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాం..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
తీరొక్క మొక్క.. పల్లె లెక్క
కనుచూపు మేర కనువిందుచేసే పచ్చిక..ఆహ్లాదాన్ని పంచే పూలతో పాటు ఇతర మొక్కలు.. నీటిలో ఈదులాడే చేపలు, బాతులు..చెట్టు కింద ధ్యానముద్రలో బుద్ధుడు..పక్కనే తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఎడ్లబండి.. అక్కడే సాగుపనిలో నిమగ్నమైన రైతుదంపతులు.. భవనం గోడలపై అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు.. పచ్చికపై ఆడుకుంటున్న చిన్నారులు.. కుందేళ్ల పరుగులు.. పక్షుల కిలకిలారావాలు..వేపచెట్టుకు కట్టిన ఊయల.. ఓపెన్ జిమ్.. ఇదీ అక్కడ అడుగుపెడితే కనిపించే అందమైన ‘పల్లె దృశ్యం’. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ బంగ్లాలో.. పర్యావరణహితంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌తోపాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ బంగ్లాలను గతేడాది ఫిబ్రవరి 12న ప్రారంభించారు. బంగ్లాలో చేరిన కలెక్టర్ పమేలా సత్పతి కేవలం 3 నెలల్లోనే తన అభిరుచికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. కొత్త ఆవిష్కరణలకు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్‌కు బంగ్లాను వేదికగా మార్చారు. పర్యావరణహితంగా, సేంద్రియ పద్ధతిలో గార్డెనింగ్, టెర్రస్, కిచెన్ గార్డెనింగ్ నిర్వహిస్తూ పలురకాల పూలమొక్కలు పెంచుతున్నారు. కలెక్టర్‌గా క్షణం తీరికలేకుండా గడిపే ఆమె కొద్ది సమయం చిక్కినా మొక్కల సంరక్షణలోనే గడుపుతారు. బంగ్లాను ఉద్యానవనంగా మార్చిన ఆమె.. రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన గార్డెన్ ఫెస్టివల్–2023లో సేంద్రియ పద్ధతిలో పర్యావరణహితంగా చేపట్టిన వ్యక్తిగత గార్డెనింగ్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్నారు. ఎటుచూసినా పచ్చదనం.. పూల అందాలే.. కలెక్టర్ బంగ్లా టెర్రస్ వందల రకాల మొక్కలతో చిన్నపాటి ఉద్యానవనాన్ని తలపిస్తోంది. ఇక బంగ్లా ఆవరణ 400 రకాల మొక్కలకు నెలవైంది. వాటి రక్షణకు విభిన్నమైన కుండీలు పెట్టారు. నీటి మొక్కల కోసం తొట్లను ఏర్పాటుచేశారు. కలెక్టర్ బంగ్లా కిటికీలు, ఇంట్లోకి వెళ్లే కారిడార్, వరండా.. ఇలా ఆవరణ మొత్తం అందమైన మొక్కలతో నింపేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కొత్త మొక్కలు సేకరించి.. వాటిని తన బంగ్లా ఆవరణలో నాటడం పమేలాకు అలవాటు. అలాగే, వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన మొక్కలు పెంచుతున్న వారి దగ్గర నుంచీ కొన్నింటిని తెచ్చారు. వృథా సామగ్రి, రాళ్లు, ఇసుక, రకరకాల మట్టితో గార్డెనింగ్ నిర్వహిస్తున్నారు. మొక్కలంటే ప్రాణం.. మొక్కలంటే నాకు ప్రాణం. ఉద్యోగ నిర్వహణలో ఎక్కడికి బదిలీపై వెళ్లినా నా వెంట లగేజీతోపాటు మొక్కలను కచ్చితంగా తీసుకెళ్తా. మా అమ్మ వ్యవసాయ శాస్త్రవేత్త కావడంతో పదేళ్లప్పటి నుంచే నాకూ మొక్కలంటే ఇష్టం ఏర్పడింది. చిన్నప్పుడు మా అమ్మతో వెళ్తే అక్కడ కొందరు నాకు మొక్క లు బహుమతిగా ఇచ్చేవారు. అలా నాకు మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగింది. నేను ప్రస్తుతం ఉంటున్న బంగ్లాలో 400 మొక్కల తొట్లు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నా మొక్కల సంరక్షణకు రోజూ కొంత సమయం కేటాయిస్తాను. – పమేలా సత్పతి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ -
మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు : మేడ్చల్
-
గ్రీనరీ.. పెరిగిన సీనరీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ పచ్చదనానికి హారతిపడుతోంది. హరితానికి హారం వేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం దోహదం చేస్తోంది. వనాలు, సామాజిక అడ వులు, అవెన్యూ ప్లాంటేషన్, గ్రామానికో నర్సరీ మొదలైన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తు న్నాయి. భారత అటవీ సర్వే గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. లక్ష్య సాధనలో ముందడుగు జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలోని 33 శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలి. దీనిని అంచనా వేసేందుకు జాతీయ అటవీ సర్వే సంస్థ (ఎఫ్ఎస్ఐ) రెండేళ్లకోసారి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణత తీరుతెన్నులపై సర్వే చేస్తోంది. భారత అటవీ సర్వే – 2019 లెక్కల ప్రకారం.. తెలంగాణ అటవీ విస్తీర్ణం 163.31 చ.కి.మీ. పెరిగింది. గత రెండేళ్లలో 12,730 హెక్టార్లలో అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలను నాటారు. మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ. కి.మీ.కాగా 20,582.31 చ.కి.మీ.మేర అడవులు వ్యాపించి ఉన్నాయి. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 18.36 శాతమే. 2015 – 2019 మధ్య కాలంలో పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ – 1980 కింద 9,420 హెక్టార్లలో చెట్లు నరికారు. కానీ, హరితహారం కింద గత నాలుగేళ్లలో దాదాపుగా 150 కోట్ల మొక్కలను నాటారు. 2015– 17లో తెలంగాణకు ఐదో స్థానం 2015 –17లో విడుదల చేసిన భారత అటవీ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణకు ఐదోస్థానం దక్కింది. భౌగోళికంగా, జనాభాపరంగా చిన్నవైన ఈశాన్య రాష్ట్రాలు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాల్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో ఏకంగా 75 – 90 శాతం వరకు అటవీ ప్రాంతాలే ఉంటాయి. పెద్ద రాష్ట్రాల్లో పచ్చదనం 10 – 27 శాతమే. జాతీయస్థాయి సగటు పచ్చదనం 24 శాతం కాగా, తెలంగాణది మాత్రం 20.6 శాతమే. 2015తో పోలిస్తే 2017లో తెలంగాణలో 565 చ.కి.మీ.ల మేర పచ్చదనం పెరిగింది. 2017 – 19 నివేదిక ప్రకారం 163.31 చ.కి.మీ. మేర అటవీ విస్తీర్ణం తెలంగాణలో పెరిగింది. సర్వేలో వెల్లడైన విషయాలు ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే 33 శాతం అడవులను కలిగి ఉన్నాయి. జాతీయ అటవీ సర్వే – 2019 నివేదిక ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 6.69 చ.కి.మీ.లలో అడవుల విస్తీర్ణం తగ్గింది. మిగిలిన అన్ని జిల్లాల్లో పెరిగింది. దట్టమైన అడవులు కేవలం వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మూడు జాతీయ పార్కులు, 9 వన్యప్రాణుల సంరక్షణ అభయారణ్యాలున్నాయి. పర్యావరణ నిపుణుల సూచనలు అటవీ విస్తీర్ణం పెరుగుదల, క్షీణతకు సంబంధించిన గణాంకాల నమోదు విషయంలో పర్యావరణ రంగ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉపగ్రహ ఛాయా చిత్రాలతో చెట్ల పైభాగంలోని పచ్చదనం(పందిరి) ఒక హెక్టార్లో 10 శాతం మేర ఆవరించి ఉంటే ఆ ప్రాంతాన్ని అడవిగా గుర్తించడంపై కొన్నాళ్లుగా పర్యావరణ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అడవులు, పర్యావరణంపై ఇటీవల వరంగల్‌లో జరిగిన సదస్సులోనూ పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అడవుల పచ్చదనాన్ని అంచనా వేసేటప్పుడు అటవీ భూముల యాజమాన్య హక్కులు, చెట్ల జాతులు నిర్వహణ వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. -
ప్రతి వ్యక్తీ ఐదు మొక్కలు నాటాలి; అంబటి రాయుడు
యాచారం: ప్రతి వ్యక్తీ ప్రతి యేటా ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు కోరారు. ఆరో విడత హరితహారంలో భాగంగా గురువారం యాచారం మండల కేంద్రంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా హరితహారం నిర్వహించడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటి సంరక్షణ చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్యభాషా, జెడ్పీటీసీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, యాచారం సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉప సర్పంచ్ గొల్లపల్లి లలిత, ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి సురేష్‌రెడ్డి పాల్గొన్నారు. మొక్క నాటి నీళ్లు పోస్తున్న క్రికెటర్ అంబటి రాయుడు -
మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణం
రాంగోపాల్‌పేట్: స్వచ్ఛమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే మొక్కల పెంపకం విస్త్రతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమ వారం సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. వాతావరణం కాపాడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. చెట్లను పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 33 శాతం ఉన్న అడవులు 24 శాతానికి తగ్గిపోయాయని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు సుమారు రూ.230 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం చేపడుతున్నట్లు తెలిపారు. మినిస్టర్ రోడ్లో రసూల్‌పుర చౌరస్తా నుంచి రాణిగంజ్ వరకు పాఠశాల, కళాశాలల విద్యార్థులు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలసి సుమారు 2 వేల మొక్కలను నాటారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఉప కమిషనర్ నళిని పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యాలకు మించి మొక్కలు నాటితే ప్రోత్సాహకాలు
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటిన సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు వివిధ విభాగాల కోటాల నుంచి ప్రత్యేక నిధులను కేటాయించనుంది. నిర్దేశిత లక్ష్యాన్ని మించి మొక్క లు నాటే పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వర కు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించేందు కు సిద్ధమవుతోంది. మొక్కలు నాటే పౌరులు, యువజన, ప్రజా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఈ ప్రోత్సాహకాలను అం దజేయనుంది. మొక్కలు నాటేవారికి మొత్తం రూ.15 కోట్లతో 523 హరితమిత్ర అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది లక్ష్యం 83 కోట్ల మొక్కలు ఐదేళ్ల కాలానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, గత నాలుగేళ్లలో 113.51 కోట్ల మొక్కలు నాటారు. 2019–20 ప్రణాళికలో భాగంగా అ న్ని జిల్లాల్లోని నర్సరీలన్నింటిలో కలిపి మొత్తం వందకోట్ల మేర మొక్కలు పెంచి, 83 కోట్ల మేర మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. మొక్కలు నాటేందుకే పరిమితం కాకుండా.. కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వ పచ్చదనం పెంపు, మొక్కలు నాట డాన్ని తప్పనిసరి చేస్తూ, ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటును కూడా ప్రతిపాదించింది. వర్షాల సీజన్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని హడావుడి చేయటం మాత్రమే కాకుండా, ఏడాది పొడగునా మొక్కల సంరక్షణకు ఆయా శాఖలు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రక్షణ చర్యలు చేపట్టడం, నీటి సౌకర్యం కల్పించటం, మొక్కలు నాటిన ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేయటం, అటవీ శాఖ నిర్వహిస్తున్న వెబ్సైట్లో అప్లోడ్ చేయటం, ప్రతీ నెలా ఆ మొక్కల ఎదుగుదలను, బతికిన మొక్కల శాతాన్ని నమోదు చేయాలని కూడా ప్రభుత్వం సూచించింది. గత మూడేళ్లుగా మొక్కలు నాటిన ప్రాంతాల్లో, చనిపోయిన మొక్కలను గుర్తించి కొత్త వాటిని నాటాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 40 లక్షల మొక్కలను, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని ప్రణాళికను సిద్ధం చేసింది. -
‘రౌడీ’లకు విజయ్ దేవరకొండ చాలెంజ్
గతంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఫిట్నెస్ చాలెంజ్ తరహాలో ప్రస్తుతం గ్రీన్ చాలెంజ్ ట్రెండ్ అవుతోంది. పలువురు సినీ రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమ సన్నిహితులకు గ్రీన్ చాలెంజ్‌ను విసురుతున్నారు. పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. తనకు కిడాంబి శ్రీకాంత్, బొంతు రామ్మోహన్‌లు విసిరిన హరితహారం సవాల్‌ను స్వీకరించిన విజయ్, కాకినాడ యువకులతో కలిసి మొక్కలు నాటారు. తరువాత వారితో కలిసి భోజనం చేస్తూ సరదాగా గడిపారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు. #HarithaHaram #GreenChallenge accepted :) Planting trees and lunching with my Kakinada Boys :)) I now challenge my rowdies @Sheetal_Chowhan @samhitha17 @ChaltanyaReddy @akshitha9198 @karanam_pooja @xziamstheticx @keerthanaGMalar pic.twitter.com/gB4iyjBvtD — Vijay Deverakonda (@TheDeverakonda) 31 August 2018 -
చాలెంజ్ స్వీకరించిన విజయ్ దేవరకొండ
-
కవిత చాలెంజ్ స్వీకరించిన రాజమౌళి
ఇటీవల ఫిట్‌నెస్‌చాలెంజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్నెస్ చాలెంజ్‌ను స్వీకరించి తమ వర్క్ అవుట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా మరో ఆసక్తికర చాలెంజ్‌కు సోషల్‌మీడియా వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమానికి మద్దతుగా ప్రముఖులు గ్రీన్ చాలెంజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో తాను మొక్కలు నాటుతున్న ఫొటోను షేర్ చేశారు. ‘చాలెంజ్ స్వీకరించాను కవిత గారు. మర్రి చెట్టు, గుల్మొహర్, వేప మొక్కలు నాటాను. ఇప్పుడు నేను పుల్లెల గోపిచంద్ గారు, కేటీఆర్‌గారు, యువ దర్శకులు సందీప్ వంగా, నాగ అశ్విన్‌ల ను హరిత హారం చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు. రాజమౌళి ట్వీట్ పై స్పందించిన కవిత, రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు. Accepted priyanka’s nomination & Doing my bit for greener World !! I nominate miss @Nsaina, Deputy CM Mahmood Ali garu, RadhaKrishna garu @abntelugutv & @ssrajamouli garu to take up the green challenge!! Plant a sapling & spread the word for a greener better world!! #HarithaHaram pic.twitter.com/fTbp92JAzG — Kavitha Kalvakuntla (@RaoKavitha) 21 July 2018 Thank you @ssrajamouli garu 😊👍 https://t.co/jbmYhkw2IP — Kavitha Kalvakuntla (@RaoKavitha) 24 July 2018 -
మొక్క మొక్కకో రూపాయి!
సిద్దిపేటజోన్ : రైతులతో పాటు ఇతరులకూ హరితహారం మొక్కలు కాసులు కురిపిస్తున్నాయి. మొక్కలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వాచ్ అండ్ వార్డు కింద రైతులకు లబ్ధి చేకూర్చేందుకు, పరోక్షంగా ఆదాయాన్ని అందించే ప్రక్రియను గత ఏడాది చేపట్టింది. నిబంధనల మేరకు నాటిన మొక్కల్లో 60 శాతం సంరక్షించిన వారికి ఆయా మొక్కను బట్టి రూ.1 నుంచి రూ.15 వరకు ప్రోత్సాహకం అందిస్తోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోని గ్రామాలకు ప్రభుత్వం వాచ్ అండ్ వార్డు కింద ప్రోత్సాహక నిధులు కేటాయించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి సంబంధిత గ్రామీణ శాఖ రికార్డుల ప్రకారం 60 శాతం బతికిన మొక్కలకు ఇప్పటి వరకు సుమారు రూ.3.44 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా వాచ్ అండ్ వార్డు కింద 75.43 లక్షల మొక్కలను గుర్తించిన అధికారులు.. వాటిని కేటగిరి ఆధారంగా రైతులకు, సంబంధిత వ్యక్తులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాన్ని అందించారు. సంబంధిత శాఖ రికార్డులను పరిశీలిస్తే చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట, దౌల్తాబాద్, దుబ్బాక, గజ్వేల్, ములుగు, కొండపాక, చేర్యాల మండలాల్లో అత్యధికంగా మొక్కలను పరిరక్షించిన వారు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందుకున్నారు. గరిష్టంగా రూ.15 అందజేత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం కింద జిల్లా వ్యాప్తంగా ప్రతి విడతలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను కాపాడే ప్రయత్నంతో పాటు సంబంధిత మొక్కను 60 శాతం బతికించే రైతులకు, ఇతర వ్యక్తులకు పరోక్షంగా ఆదాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలోనే జిల్లా యంత్రాంగం వాచ్ అండ్ వార్డు పథకం కింద ప్రతి మొక్కను నిబంధనల మేరకు బతికించినందుకు ప్రోత్సహకంగా కొంత నగదు ప్రకటించింది. ఈక్రమంలోనే యూకలిప్టస్(నీలగిరి) చెట్టుకు రూ.1, ఈతతో పాటు ఇతరత్ర మొక్కలకు రూ.5, గ్రామ పొలిమేరుల్లో ఇరువైపులా చేపట్టిన ఎవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రూ.12.34, ఉద్యాన మొక్కలకు రూ.15 చొప్పున ప్రోత్సాహకాన్ని కేటాయించింది. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల్లో సంబంధిత మొక్కలను 60 శాతం వరకు నాటిన 75,43,946 మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించింది. ఈ లెక్కన ఆయా మొక్కలను కాపాడిన వారికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.3,44,20,291 కేటాయించింది. మొక్కలతో అత్యధిక ఆదాయం పొందుతున్న మండలాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఇదే స్ఫూర్తిని మిగతా మండలాలు తీసుకున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట మండల పరిధిలో 4,80,785, ములుగు మండలంలో 6,03,044, దౌల్తాబాద్‌లో లక్ష, చేర్యాలలో 50 వేల మొక్కలను వాచ్ అండ్ వార్డు పథకం కింద గుర్తించడంతో పాటు ప్రోత్సాహకం అందించారు. ఇదిలా ఉండగా, హరితహారం కింద గ్రామాల్లో మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన వాచ్ అండ్ వార్డు పథకం సత్ఫలితాలు ఇస్తోంది. పెంచిన మొక్కల్లో 60 శాతం సంరక్షించిన వారికి రెండేళ్ల పాటు ఈ సహాయాన్ని అందిస్తోంది. -
వీరభద్రుడి భక్తులకు ‘వృక్ష’ ప్రసాదం
భీమదేవరపల్లి (హుస్నాబాద్): తరిగిపోతున్న వృక్ష సంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఏటా పెద్ద ఎత్తున మొక్కలను నాటుతోంది. దానిని స్ఫూర్తిగా తీసుకుని ‘దేవుడిని మొక్కు.. మొక్కను నాటు’అనే నినాదంతో వేలేరు మండలం కన్నారం గ్రామానికి చెందిన జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి భక్తులకు మొక్కల పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. సొంత ఖర్చుతో జామ, మామిడి, తులసి, నిమ్మ మొక్కలను భక్తులకు అందించేందుకు ఆయన ముందుకొచ్చారు. ‘వృక్ష ప్రసాదం’పేరిట బ్రహ్మోత్సవాలకు హజరయ్యే భక్తులకు ఒక్కో కుటుంబానికి ఒక్కో మొక్క, దేవుడి క్యాలెండర్‌ను ఒక బ్యాగ్‌లో భద్రపరిచి అందించను న్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం మంత్రి ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌బాబు ప్రారంభించనున్నారు. పంపిణీ ఇలా... కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యాయి. ప్రధాన ఘట్టాలైన భోగి, సంక్రాంతి, వసంతోత్సవ కార్యక్రమాలు 14, 15, 16 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. వీరికి వృక్ష ప్రసాదం పేరిట పంపిణీ చేయనున్న పండ్ల మొక్కలు ఇప్పటికే ఆలయానికి చేరుకున్నాయి. మొక్కల పంపిణీ కోసం రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్లో ఐదుగురు అర్చకులు, 25 మంది వలంటీర్లు సేవలను అందించనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు రాగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద అర్చకుడు సదరు భక్తుడికి బొట్టు పెట్టి ఒక పండ్ల మొక్క, దేవుడి ఫొటోతో కూడిన క్యాలెండర్‌ను ప్రత్యేకంగా రూపొందించిన బ్యాగ్‌లో ఉంచి అందించనున్నారు. వృక్ష ప్రసాదం స్వీకరించే సమయంలోనే వలంటీర్లు భక్తుడి పేరు, చిరునామా, వారి ఫోన్ నంబరు సేకరించనున్నారు. జాతర ముగిసిన అనంతరం వరుసగా మూడు మాసాల పాటు సదరు మొక్క తీసుకున్న భక్తులకు ‘మీరు తీసుకున్న మొక్కను కాపాడండి’ అంటూ సెల్ ఫోన్‌కు మెసేజ్ పంపించే విధంగా కార్యాచరణ సైతం రూపొందించారు. సంపూర్ణ ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దారు.. వృక్ష ప్రసాదం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి గతంలో తన స్వగ్రామమైన వేలేరు మండలం కన్నారం గ్రామాన్ని సంపూర్ణ ఓడీఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దారు. సొంత గ్రామానికి కొంత సేవ చేయాలనే సంకల్పంతో గతేడాది కన్నారంలో సర్పంచ్, గ్రామస్తులు, అధికారుల కృషితో వంద శాతం ఓడీఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దడంలో సురేందర్‌రెడ్డి సఫలీకృతుడయ్యాడు. వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రథమంగా కన్నారం గ్రామం సంపూర్ణ బహిరంగ మల విసర్జన గ్రామంగా తీర్చిదిద్దిన ఘనత సురేందర్‌రెడ్డిదే. అదే స్ఫూర్తితో తన జీవిత భాగస్వామి శ్రీదేవి ప్రోద్భలంతో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేవే లక్ష్యంగా... భగవంతుడి వద్దకు వచ్చే భక్తులకు మొక్కను ఇస్తే వారు తప్పకుండా ఆ మొక్కలను రక్షిస్తారు. సీఎం చేపట్టిన హరితహార‡ కార్యక్రమం నన్నెంతో ఆకర్షించింది. అందులో నేను కూడా భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా. భగవంతుడి సన్నిధిలో మొక్కలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. –జన్నపురెడ్డి సురేందర్ -
ఆస్ట్రేలియాలో హరితహారం
మెల్బోర్న్ : మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ హరితహారం కార్యక్రమం నిర్వహించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రం సుభిక్షంగా మారాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం తెలంగాణ వ్యాప్తంగా ఒక విప్లవంలా మారిందన్నారు. భవిష్యత్తులో వాతావరణ కాలుష్య నివారణకు, వర్షాభావ పరిస్థితులను పెంపొందించడంలో చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన పుట్టినరోజు సందర్బంగా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పరిపాలనలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెడుతూ, బంగారు తెలంగాణ సాధనకు ఒక సైనికుడిలా కృషి చేస్తున్న కేటీఆర్‌పై ప్రతిపక్షాలు కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే చవకబారు విమర్శలు చేస్తున్నారని నాగేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనలో కేటీఆర్ కృషికి జాతీయ స్థాయిలో నాయకులు సైతం ప్రశంసిస్తున్నారన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి 60 సంవత్సరాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన విద్రోహానికి ఒక చెంపపెట్టని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న వినూత్న పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడమే కాకుండా తమ నాయకులపై అవాకులు, చవాకులు పేలే ప్రతిపక్షాల అసలు రంగు ఎండగట్టడంలో టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ చీటీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అర్జున్ చల్లగుళ్ళ, సునీల్ బసిరెడ్డి , సత్యం రావు గుర్జపల్లి , దిలీప్ , సాయి కిరణ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
మూడో విడత హరితహారం ప్రారంభం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్లో ప్రారంభించగా మంత్రుల జిల్లాకేంద్రాల్లోని కార్యక్రమంలో పాల్గొని మొక్కటు నాటారు. మొక్కలు నాటిన కడియం వరంగల్ అర్బన్ జిల్లాలో తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరులోని 4వ బెటాలియన్ క్యాంపు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆమ్రపాలి, పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మూడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగాబొటానికల్ గార్డెన్లో హరిత హారం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ హాజరయ్యారు. గార్డెన్‌లోని ముప్పై ఎకరాల్లో ఏడు వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్ మూసారాంబాగ్‌లోని స్వామి వివేకానంద ఉన్నత పాఠశాలలో విద్యార్థులలు, కార్పొరేటర్ సునరితారెడ్డి, మలక్‌పేట్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ ఆజం ఆలీలతో కలిసి మేయర్ మొక్కలు నాటారు. మొక్కల శాతం పెరగాలి: డీజీపీ అనురాగ్‌శర్మ యాచారం: మూడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డిజిల్లా యాచారం పోలీసులు స్టేషన్లో డీజీపీ అనురాగ్‌శర్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొక్కల శాతం తక్కువగా ఉందని, 33 శాతం ఉండాల్సి ఉండగా 24 శాతం మాత్రమే ఉందని తెలిపారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. అలాగే మంచాల పోలీసు స్టేషన్లోనూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గడ్డపోతారంలో ఘనంగా హరితహారం
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారం చేపట్టిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో పరిశ్రమలు, డ్రగ్స కంట్రోలర్ అధికారుల ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పారిశ్రామిక వాడలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోందన్నారు. -
హరితహారంలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు